MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • నోటి నుంచి దుర్వాసన వస్తోందా? ఈ వ్యాధులే కారణం కావొచ్చు.. చెక్ చేసుకోండి..

నోటి నుంచి దుర్వాసన వస్తోందా? ఈ వ్యాధులే కారణం కావొచ్చు.. చెక్ చేసుకోండి..

నోటి నుంచి దుర్వాసన వచ్చినంత మాత్రాన.. వాళ్లు నోటిని సరిగ్గా క్లీన్ చేయడం లేదు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే శరీరంలో కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోతే కూడా నోట్లో నుంచి దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 28 2022, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
bad breath

bad breath

నోట్లో నుంచి చెడు వాసన రావడానికి కారణాలెన్నో  ఉన్నాయి. అయితే వాళ్ల నోట్లో నుంచి వాసన వస్తున్నట్టుగా వాళ్లకు అసలే తెలియదు. ఇతరులకే తెలుస్తుంది. కానీ ఈ బ్యాడ్ స్మెల్ వల్ల నలుగురిలో మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోట్లో నుంచి చెడు వాసన రావడానికి అసలు కారణం మాత్రం దంతాలను, నోటిని సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడమే. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం చాలా మంచిది. దీనివల్ల నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోతేనే నోట్లో నుంచి  బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయితే నోట్లో నుంచి ఇలా వాసన రావడానికి  ఇతర కారణాలు కూడా ఉన్నాయి. శరీరంలో కొన్ని అవయవాల  పనితీరు దెబ్బతింటే కూడా ఇలా వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

25

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల కూడా నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది. నిజానికి ఊపిరితిత్తుల్లో ఏరకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా.. శ్లేష్మం బయటకు రావడం మొదలవుతుంది. దీనిస్మెల్ అస్సలు బాగోదు. దీనివల్లే నోటినుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

35

కాలెయ వ్యాధి

కాలెయ వ్యాధి వల్ల కూడా నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలెయం మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఒక వేళ కాలెయం సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించబడవు. దీంతో రక్తంలో ట్యాక్సిన్స్ పేరుకుపోతాయి. దీంతో నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. 

45

మూత్రపిండాల వ్యాధి

మూత్రపిండాల వ్యాధి వల్ల నోరు ఊరికూరికే పొడిబారుతూ ఉంటుంది. మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటేనే యూరియా సులువుగా ఫిల్టర్ అవుతుంది. కానీ మూత్రపిండాలు ఆరోగ్యం చెడిపోయి.. ఇవి సరిగ్గా పనిచేయకుంటే యారియా ఫిల్టర్ కాదు. దీనివల్ల నోట్లో చెడు వాసన వస్తుంది. 
 

55

ఇతర కారణాలు

పై అనారోగ్య సమస్యలతో పాటుగా ఇతర కారణాల వల్ల కూడా నోట్లో నుంచి చెడు వాసన వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నోట్లోనుంచి చెడు వాసన రావడం మధుమేహం ప్రారంభ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రక్తంలో కీటోన్ స్థాయిలు పెరగడం వల్ల ఇలా అవుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
South Goa Food: సౌత్ గోవాలో ది బెస్ట్ హోటల్స్ ఇవే.. మార్టిన్స్ కార్నర్ నుంచి జెస్ట్ కేఫ్ వరకు టాప్ 9 ప్లేసెస్!
Recommended image2
Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!
Recommended image3
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved