Health Tips: చికెన్, మటన్ లో ఏది తినాలి? ఏది మన ఆరోగ్యానికి మంచిదంటే..
Health Tips: చికెన్ తర్వాత చాలా మంది మటన్ నే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తదో ఇప్పుడు తెలుసుకుందాం..

Suicide Chicken Wings
కొంత మంది వెజ్ వంటకాలు ఇష్టముంటే.. మరికొంతమంది మాత్రం నాన్ వెజ్ వంటకాలనే ఇష్టపడతారు. ఏ ఫుడ్ తీసుకున్నా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఈ సంగతి పక్కన పెడితే .. మన దేశంలో చాలా మందికి మాంసాహారాల్లో చికెన్ తో చేసిన వంటకాలే ఇష్టం. వీటినే ఎక్కువగా తింటూ ఉంటారు.
అయితే చికెన్ తర్వాత చాలా మంది గొడ్డు మాంసాన్ని తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ కొంత మంది మాత్రం గొడ్డు మాంసాన్ని అసలే ముట్టరు. ఇలాంటి వారు మటన్ వంటకాలను ఎక్కువగా తింటుంటారు. చికెన్ లాగే మటన్ ప్రియులు కూడా ఎక్కువే. అయితే కొంతమంది మటన్ ఆరోగ్యానికి మంచిది కాదని దీనికి దూరంగా ఉంటారు. నిజానికి చికెన్ కంటే మటనే ఆరోగ్యానికి ఎక్కువ మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మటన్ వంటకాల్లో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ చికెన్ లో కంటే మటన్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాదు మటన్ లో ఐరన్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. సోడియం కంటెంట్ చికెన్ లో కంటే మటన్ లోనే తక్కువగా ఉంటుంది. శరీరానికి ఎక్కువ సోడియం కంటెంట్ ఏ మాత్రం మంచిది కాదు.
చికెన్ వంటకాల విషయానికొస్తే.. దీనిలోని కొన్ని భాగాలు మినహా.. అన్నింటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. నిజమేమిటంటే.. ఇది మన శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. చికెన్ కాళ్లు, రెక్కలు, థైస్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. చెస్ట్ భాగంలో కొవ్వు కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది చికెన్ చెస్ట్ భాగాలను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా కోడి చెస్ట్ భాగాన్నే ఎంచుకోవాలి.
<p>mutton</p>
చికెన్ కంటే మటన్ మంచిదే అయినప్పటికీ.. దీన్ని మోతాదుకు మించి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ విషయంలోనూ అంతే. మాంసం ఏదైనప్పటికీ.. తినే పరిమాణం ఎల్లప్పుడూ.. పరిమితంగానే ఉండాలి. లేదంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో మీరు ఊబకాయం బారిన పడొచ్చు. ఇది గుండె పోటు, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది.