చియా విత్తనాలను అందరూ తినొచ్చా..? దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా..
చియా గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీళ్లలో నానబెట్టి లేదా సలాడ్ లో వేసుకుని తింటుంటారు. అయితే ఇవి కొందరి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
డయాబెటిస్ అనేది ఒక వ్యాధి. ఇది ఒకసారి వచ్చిన తర్వాత దీని నుంచి బయటపడటమంటూ ఉండదు. దీనికి రెగ్యులర్ మందులను వాడుతూనే ఉండాలి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చియా విత్తనాలు డయాబెటిక్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. నిజానికి చియా గింజల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి.
చియా గింజల్లో ఫైబర్, మెగ్నీషియం, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ టైప్ 2 డయాబెటిస్ సంక్లిష్టతల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. సంతులిత ఆహారంతో పాటుగా క్రమం తప్పకుండా చియా విత్తనాలను తినడం వల్ల సులువుగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. బరువు తగ్గితే.. డయాబెటిస్ చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు చియా విత్తనాలు శోథ నిరోధక స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. కాబ్టటి ఈ గింజలను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఒక ఔన్సు చియా విత్తనాల్లో 10 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వయస్సు, జెండర్ ను బట్టి రోజుకు 22.4 నుంచి 33.6 గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలి. షుగర్ పేషెంట్లు రోజుకు రెండు టేబుల్ స్పూన్లు లేదా 20 గ్రాముల చియా విత్తనాలను తినాలి. ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను, సన్నగా తరిగిన నిమ్మకాయ ముక్కలను వేయండి. ఒక గంట తర్వాత ఈ నీటిని తాగండి. మధుమేహులు సలాడ్లలో ఈ విత్తనాలను కలిపి కూడా తీసుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, గింజల్లో వీటిని వేసుకుని తిన్నా మంచిదే. చియా, అవిసె గింజలను సలాడ్లలో మిక్స్ చేసి తినడం ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
చియా విత్తనాల దుష్ప్రభావాలు: చియా విత్తనాలు డయాబెటీస్ పేషెంట్లకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. కానీ వీటిని అతిగా తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అలెర్జీలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని ఎక్కువగా అసలే తినకూడదు. ఎందుకంటే దీనివల్ల ఈ సమస్యలు ఎక్కువవుతాయి. ఏదేమైనా వీటిని ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ కావాలని మరీ ఎక్కువగా తింటే ఇతర సమస్యలు వస్తాయి.