MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రాత్రి పడుకునే ముందు నీళ్లను తాగుతున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

రాత్రి పడుకునే ముందు నీళ్లను తాగుతున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

మన శరీరానికి నీళ్లు అవసరం కాదు.. అత్యవసరం. ఎందుకంటే నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ నీళ్లు ఏ సమయంలో తాగాలి? ఏ సమయంలో తాగడకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 27 2022, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. అందుకే నీటిని పుష్కలంగా తాగాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇది మీ ప్రాణాలను కూడా తీయొచ్చు. ఈ నిర్జలీకరణం ప్రమాదకరమైన రోగాలకు కూడా దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండే వయోజనులు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే కొంతమందికి రాత్రిపూట నీళ్లను తాగడం మంచిదా? కాదా? అన్న డౌట్ పుడుతుంది. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. 
 

27

రాత్రిపూట నీళ్లు తాగాలా? వద్దా? 

భోజనం చేసేటప్పుడు, ఆ వెంటనే నీళ్లను తాగడం మంచిది కాదు. ఒక 40 నిమిషాల గ్యాప్ ఇచ్చి నీళ్లను తాగొచ్చు. ఇకపోతే రాత్రి పడుకునే ముందు పుష్కలంగా నీళ్లను తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ నీళ్లు మీరు తిన్న ఆహారం సులువుగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సమయంలో నీటిని తాగడం వల్ల ఖనిజాలు, విటమిన్లు శరీరంలో బాగా శోషించకోబడతాయి. అలాగే జీవక్రియలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ట్యాక్సిక్స్, ఇతర వేస్ట్ పదార్థాలను బయటపడేయడానికి కూడా సహాయపడుతుంది. 
 

37

నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

తక్కువ నీళ్లను తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో కిడ్నీల్లో రాళ్లు, అర్ష మొలలు, మలబద్దకం, అజీర్థి, వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే పగటి సమయంలో నీళ్లను ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి పడుకునే కొన్ని గంటల ముందు నీళ్లను ఎక్కువగా తాగండి. అయితే పడుకునేటప్పుడే నీళ్లను  ఎక్కువగా తాగితే మాత్రం మీకు నిద్ర సరిగ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తుంది. 

47

రాత్రి మనం పడుకోవడంతో సహజంగా శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఉదయాన్నే వేడి నీటిని తీసుకుంటే శరీరం సమతుల్యంగా ఉంటుంది. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. కనుక ప్రతిరోజూ ఉదయాన్నే వేడి నీటిని తాగండి అందంగా (Beautifully), ఆరోగ్యంగా (Healthy) ఉండండి.

57

నీళ్లు మరీ ఎక్కువగా తాగడం మానుకోండి..

శరీర అవసరానికి మించి నీళ్లను అతిగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. హార్ట్ పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లు రాత్రిపూట నీళ్లను ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఎందుకంటే వీళ్లు నీళ్లను ఎక్కువగా తాగితే రాత్రిపూట నిద్రపోకుండా మూత్రానికే వెళ్లాల్సి వస్తుంది.  దీనివల్ల మీ నిద్రంతా పాడవుతుంది. రాత్రిపూట 8 గంటలు పడుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. 

67

రాత్రిపూట నీరు ఎలా తాగాలి? 

నార్మల్ వాటర్ కు బదులుగా గ్రీన్ టీ లేదా నిమ్మరసం లేదా హెర్బల్ టీ, ఇతర హెల్తీ డ్రింక్స్ ను తాగండి. సాదా నీటిని తాగితే  రాత్రి పూట మూత్రవిసర్జన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే రాత్రిపూట ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని మాత్రమే తాగండి. ఆరోగ్యంగా ఉంటారు. 
 

77

రాత్రిపూట నీటిని ఎందుకు తాగాలి?

రాత్రి భోజనం తర్వాత నీళ్లను తాగడం వల్ల శరీరం సహజసిద్ధంగా శుభ్రపడుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ తొలగించడానికి ఈ నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందులో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు తప్పకుండా పడుకునే ముందు నీళ్లను తాగడం చాలా మంచిది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్లను తాగితే మంచిది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: పరగడుపున రోజూ ఇవి తింటే.. బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
మహిళలు ప్రతి ఏడాది ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్
Recommended image3
Flax Seeds: చలికాలంలో అవిసె గింజలు తినొచ్చా? తింటే ఏమవుతుంది? ఎవ్వరు తినకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved