MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ వ్యాధులున్నాయా? అయితే గుమ్మడి గింజలు తినండి తగ్గిపోతాయి..

ఈ వ్యాధులున్నాయా? అయితే గుమ్మడి గింజలు తినండి తగ్గిపోతాయి..

గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాలను కూడా ఇట్టే తగ్గిస్తాయి..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 18 2022, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గుమ్మడి గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. గుమ్మడి కాయతో వంటలు కూడా చేసుకుని తింటుంటారు. దీన్ని స్వీట్ల తయారీలో కూడా  ఉపయోగిస్తుంటారు. కానీ చాలా మంది గుమ్మడి గింజలు దేనికీ పనికిరావని డస్ట్ బిన్ లో వేస్తుంటారు. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఈ పని ఇంకెప్పుడూ చేయరు తెలుసా..?  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గుమ్మడి గింజల్లో ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ, ఐరన్, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీంతో  పక్షవాతం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 
 

37

గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ ఎ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

47

ఒత్తిడి తగ్గుతుంది: పని, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటి ఎన్నో కారణాల ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి కొన్ని రోజులకు డిప్రెషన్ కు దారితీస్తుంది. ఈ డిప్రెషన్ వల్ల మానసిక  ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఒత్తిడిని మొదట్లోనే తగ్గించుకోవాలి. అయితే గుమ్మడి విత్తనాలు ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిలో ఉండే విటమిన్ బి, జింక్ లు కూడా టెన్షన్ ను తొలగిస్తాయి. 

57

నిద్రలేమి:  నిద్ర మన శరీరానికి చాలా అవసరం. కారణాలేవైనా.. నిద్రకు భంగం కలిగితే మాత్రం.. అటు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి గుమ్మడి గింజలు మెడిసిన్ లా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి రాత్రిళ్లు మీరు హాయిగా నిద్రపోయేందుకు సహాయపడతాయి. 

67

మధుమేహులకు మంచివి: గుమ్మడి గింజలు షుగర్ పేషెంట్ తప్పకుండా తినాలి. ఎందుకంటే దీనిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతకాదు  దీనిలో ఉండే ఔషదగుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. 

77

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఎక్కడ లేని రోగాలు చుట్టుకుంటాయి. అయితే గుమ్మడి గింజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి.. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఇ నే  ఇమ్యూనిటీని పెంచుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Chain Earring: ఈ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మహారాణిలా కనిపిస్తారు
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved