ఉదయం పూట ఈ పండ్లను తినండి.. క్యాన్సర్ నుంచి గుండెపోటు వరకు ఎన్నో రోగాలు నయమవుతాయి..
పుల్ల పుల్లగా, తియ తీయగా ఉండే ఎన్నో రకాల పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎన్నో రకాల రోగాలను తగ్గించడంలో మెడిసిన్స్ లాగే సహాయపడతాయి.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

Fruits
పండ్ల ద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. వీటివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పోషకాల లోపం కూడా పోతుంది. అయితే కొన్ని రకాల పండ్లను ఉదయం పూట తినడం వల్ల ఎన్నో వ్యాధుల ప్రమాదం తగ్గడంతో పాటుగా.. కొన్ని రోగాలు కూడా నయమవుతాయి. అయితే ఈ పండ్లను తొక్కతో సహా తింటే మరిన్ని ప్రయోజనాలను పొందొచ్చంటున్నారు నిపుణులు. ఉదయం పూట కొన్ని రకాల పండ్లను తింటే మలబద్దకం, అజీర్థి వంటి జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
గుండె జబ్బులను నివారించడానికి..
ఉదయం పూట నారింజ, బెర్రీలు, నేరేడు పండ్లు, పుచ్చకాయ, ఆపిల్ పండ్లను తింటే మంచిది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ ఇ, పొటాషియం, విటమిన్ కె, ఫ్లేవనాయిడ్లు, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. గుండెపోటు, స్ట్రాల్ వంటి ప్రమాదాలను కూడా తగ్గించడానికి సహాయడతాయి.
డయాబెటీస్ ను నియంత్రించడానికి..
ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. డయాబెటీస్ బారిన పడిన వాళ్లు ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మధుమేహులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే చెర్రీలు, ఆపిల్ పండ్లు, నారింజ వంటి పండ్లను తినాలి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి..
సిట్రస్ పండ్లైనా నారింజ, టాన్జేరిన్ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు రొమ్ము క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. అలాగే కాలెయ కణితిని తగ్గించడానికి, రాకుండా చేయడానికి సహాయపడతాయి. ఈ పండ్లు క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి.
రక్తపోటును తగ్గించడానికి..
మామిడి పండ్లు, పుచ్చకాయ, అరటి వంటి పండ్లు రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో పొటాషియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల రాళ్లు తగ్గడానికి..
విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి సహాయపడతాయి. ఎందుకంటే ఈ పండ్లలో సోడియం కంటెంట్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకు కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు సిట్రస్ పండ్లను బాగా తినండి.
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే..
ఎముకలు బలంగా ఉంటేనే మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుది. అయితే ఎముకలను బలంగా ఉంచేందుకు విటమిన్ కె, కాల్షియం సహాయపడతాయి. అందుకే ఈ పోషకాలుంటే పండ్లను ఎక్కువగా తినండి.