MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • చేదుగా ఉంటుందని కాకరకాయను తినకపోతే ఈ లాభాలను మిస్ అయిపోతారు..!

చేదుగా ఉంటుందని కాకరకాయను తినకపోతే ఈ లాభాలను మిస్ అయిపోతారు..!

కాకరకాయ రసంలో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. అలాగే రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 04 2022, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నిజానికి చేదుగా ఉంటుందని కాకరకాయను తినే వాళ్లు చాలా తక్కువే. కానీ కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీనిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీనిలో బచ్చలికూర, బ్రోకలీలోని బీటా కెరోటిన్, అరటిపండ్లలో ఉండే పొటాషియం కంటే దీనిలో రెండు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

100 గ్రాముల కాకరకాయలో 34 కేలరీలతో పాటుగా 13 మిల్లీ గ్రాముల సోడియం, 602 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్ జింక్, భాస్వరం, డైటరీ ఫైబర్స్ కూడా ఉంటాయి. 
 

37
bitter gourd

bitter gourd

కాకరకాయ రసంలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే చర్మంపై మచ్చలు, మొటిమలు, సోరియాసిస్ ను తొలగిస్తుంది.

47

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 382 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. కాకరకాయలో పాలిపెప్టైడ్-పి లేదా పి-ఇన్సులిన్ అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇదిసహజంగా డయాబెటీస్ ను నియంత్రిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. 2011 లో ప్రచురించబడిన జర్నల్ ఎథ్నోఫార్మాకాలజీ క్లినికల్ ట్రయల్ ప్రకారం.. 2,000 మిల్లీగ్రాముల కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ -2 డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుందని కనుగొన్నారు.
 

57

కాకరకాయలు విటమిన్ సి భాండాగారం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయలో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాకరకాయ రసంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. దీంతో గుండెజబ్బులు, స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది.
 

67

అంతేకాదు కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాకరకాయలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇది శరీరంలోని అదనపు సోడియాన్ని గ్రహిస్తుంది. దీనిలో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

77

కాకరకాయ వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలర్జీలు, అజీర్ణాన్ని నివారిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. 2010 లో ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కాకరకాయలో యాంటీ కార్సినోజెన్, యాంటీ ట్యూమర్ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇది ప్రోస్టేట్, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Back Designs: స్టైలిష్ లుక్ ఇచ్చే.. బ్లౌజు బ్యాక్ డిజైన్లు..!
Recommended image2
Kundan Earrings: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే కుందన్ ఇయర్ రింగ్స్
Recommended image3
నిలబడి నీళ్లు తాగితే ప్రమాదమంటారు ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved