MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • తలనొప్పి ఇన్ని రకాలుగా ఉంటుందా ? మీకొచ్చింది ఏ రకమైన తలనొప్పి తెలుసుకుంటే.. తగ్గించుకోవడం చాలా సులువు

తలనొప్పి ఇన్ని రకాలుగా ఉంటుందా ? మీకొచ్చింది ఏ రకమైన తలనొప్పి తెలుసుకుంటే.. తగ్గించుకోవడం చాలా సులువు

తలనొప్పి అందరిలో ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కరికీ ఒకోలా నొప్పి వస్తుంది. ఇలాంటి తలనొప్పులను తేలికగా తీసుకోవద్దు. వెంటనే  డాక్టర్ ను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 15 2022, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడితో కూడిన లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఈ ఒత్తిడి ఎక్కువైతే.. తలనొప్పి వస్తుంది. వయోజన జనాభాలో సుమారు 50 శాతం మంది కనీసం సంవత్సరానికి ఒకసారైనా తీవ్రమైన తలనొప్పిని అనుభవిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. కానీ తలనొప్పి అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికీ ఒకోలా ఉంటుంది. అసలు తలనొప్పి రకం ఏంటో తెలుసుకుంటే.. దానికి చికిత్స తీసుకోవడం సులువు అవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నుదుటిలో నొప్పి

కొంతమందికి నుదుటి భాగంలో నొప్పి వస్తుంది. ఇది నిద్ర లేమికి సంకేతం. ఈ రకమైన తలనొప్పిలో.. మీకు నుదిటిలో కత్తిపోటు పొడిచినంత నొప్పి కలుగుతుంది. ఈ రకమైన తలనొప్పి వచ్చినప్పుడు  కొన్ని గంటలు బాగా నిద్రపోవాలి. పడుకుంటే ఈ తలనొప్పి తగ్గిపోతుంది. ఈ రకమైన తలనొప్పి తగ్గాలంటే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.
 

37

తల పై భాగంలో నొప్పి

తల పై భాగంలో కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ రకమైన తలనొప్పి మీరు తినకపోయినప్పుడు అంటే శరీరంలో శక్తి లేకున్నా.. బాడీ డీహైడ్రేషన్ బారిన పడినా.. వస్తుంది. ఈ రకమైన తలనొప్పి వస్తే.. కడుపు నిండా తినండి. పుష్కలంగా నీటిని తాగండి.

47

తల వెనుక భాగంలో నొప్పి

కొన్ని కొన్ని సార్లు తల వెనుక భాగంలో కూడా మెడకు కొంచెం పైన నొప్పి కలుగుతుంది. ఇలాంటి నొప్పి వస్తుందంటే మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. ఇలాంటి సందర్భంలో ఒత్తిడిని పెంచే పనులను గానీ, ఆలోచనలు గానీ చేయకూడదు. ప్రతిరోజూ ధ్యానం చేయడంతో పాటుగా లోతైన శ్వాస వ్యాయామాలను చేస్తే.. ఇలాంటి తలనొప్పి తగ్గుతుంది. 

57

ముక్కు, కళ్ళ చుట్టూ నొప్పి

కనుబొమ్మల మధ్య, ముక్కు, కళ్ళ చుట్టూ నొప్పి  ఉంటే.. అది అలెర్జీ లేదా సైనస్ సమస్య వల్ల కావొచ్చు. దీనినే సైనస్ తలనొప్పి అంటారు. దీనిని తగ్గించుకోవడానికి మెడిసిన్స్ ను వాడొచ్చు. అయితే  వ్యాయామం చేసినా.. వెచ్చని నీళ్లతో స్నానం చేసినా కొంతవరకు ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

67

తీవ్రమైన తలనొప్పి

మీ నుదిటి చుట్టూ గట్టిగా ఏదో బిగించినట్టు తలనొప్పి వస్తే.. మీరు మొబైల్స్, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం చేసుకోండి. ఈ రకమైన తలనొప్పిని తగ్గించుకోవడానికి మీరు స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించుకుంటేనే ఇలాంటి తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే మొబైల్స్, టీవీ, కంప్యూటర్లను చూసే టప్పుడు బ్లూ-రే బ్లాకర్ అద్దాలను పెట్టుకోండి. వేడి స్నానం చేసినా.. ఇలాంటి తలనొప్పి తగ్గుతుంది. 
 

77

కంటి చుట్టూ నొప్పి

కొందరికి కంటి చుట్టూ భరించలేని నొప్పి వస్తుంది. మీకు క్లస్టర్ తలనొప్పి ఉందని అర్థం చేసుకోండి. ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు కంటిలో కొంత ఎరుపు రంగు ఉంటుంది. ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Turmeric Water: రోజూ పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?
Recommended image2
Gold Maang Tikka: సింపుల్ గోల్డ్ పాపిడి బిళ్లల డిజైన్లు.. తక్కువ ధరలో
Recommended image3
Bed Sheet Reuse Ideas: పాత బెడ్ షీట్లు పడేస్తున్నారా? డబ్బులు ఆదా చేసే సూపర్ ఐడియాస్ ఇవిగో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved