MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health Tips: ఖర్జూరాలను ఇలా తింటే అబ్బాయిల్లో ఆ స్టామినా పెరుగుతుంది..

Health Tips: ఖర్జూరాలను ఇలా తింటే అబ్బాయిల్లో ఆ స్టామినా పెరుగుతుంది..

Health Tips: పరిగడుపున ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య  సమస్యలు తగ్గడంతో పాటుగా  పురుషుల స్టామినా కూడా పెరుగుతుంది.  

2 Min read
Mahesh Rajamoni
Published : May 30 2022, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఖర్జూరాలు (Dates) అబ్బాయిలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని పరిగడుపున తినడం వల్ల పురుషుల స్టామినా  (Stamina) పెరుగుతుంది. అలాగే ఇవి రోగ నిరోధక శక్తిని (Immunity)పెంచడానికి  కూడా సహాయపడతాయి. ఇంతే కాదు వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

29

ఖర్జూరాల ఆరోగ్య ప్రయోజనాలు.. ఖర్జూరాల్లో కేలరీలు, ప్రోటీన్, ఐరన్, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇక వీటిని పురుషులు తినడం వల్ల వారి శరీరక బలం పెరుగుతుంది. ఇది శరీర బలహీనతను తగ్గిస్తుంది. అంతేకాదు అబ్బాయిలు వీటిని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ (Sperm Count) కూడా పెరుగుతుంది. 

39

పరిగడుపున ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఖాళీ కడుపున ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. 

49

అలాగే ఇది రక్తహీనత (Anemia) సమస్యలను తొలగించడానికి కూడా సహాయపడుంది. రెగ్యులర్ గా ఖర్జూరాలను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ (Hemoglobin) పెరుగుతుంది. 

59

మలబద్దకం (Constipation) సమస్యతో బాధపడేవారికి ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల మలబద్దకం నుంచి తొందరగా బయటపడతారు. 

69

ఖర్జూరాలు అధిక బరువు (Overweight) సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. నిజానికి వీటిని తినడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

79

ఖర్జూరాలు ఎముకలను (bones) బలంగా చేయడానికి కూడా ఎంతో సహాయపడతాయి. మీ కాళ్లు, చేతులు నొప్పిగా ఉన్నట్టైతే ఖర్జూరాలు తినండి. ఇవి నొప్పులను తగ్గించడానికి ఎంతో  సహాయపడతాయి. 

89

గర్భిణులకు ఖర్జూరాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ వీటిని తినే ముందు ఒక సారి వైధ్యుడి సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా ముఖ్యం. 

99

రోజుకు ఎన్ని ఖర్జూరాలను తినాలి.. రోజుకు 1 లేదా 2 ఖర్జూరాలను తినడం మంచిది. ఇది మలబద్దకాన్ని తొలగించడంతో పాటుగా గర్భిణులకు కూడా మంచి చేస్తుంది. నిజానికి ఖర్జూరాల్లో ఉండే ఇనుము మహిళల్లో రక్తాన్ని పెంచుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved