MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health Tips: సన్నగా ఉండేవాళ్లు వ్యాయామం చెయ్యొచ్చా? లేదా?

Health Tips: సన్నగా ఉండేవాళ్లు వ్యాయామం చెయ్యొచ్చా? లేదా?

Health Tips: వ్యాయామాలు కేవలం లావుగా ఉండేవారికే అవసరం. స్లిమ్ గా ఉండేవారికి ఈ వ్యాయామాలు గట్రా అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి వ్యాయామం ఎవరెవరికి అవసరమో తెలుసా..?  బక్కగా ఉండే వారు వ్యాయామం చేయొచ్చా? లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Mahesh Rajamoni
Published : Feb 04 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


Health Tips: వ్యాయామాలు లావుగా ఉండే వారే చేస్తుంటారు. ఎందుకో తెలుసా.. వారు బక్కగా కావాలని. మరి నేను బక్కగానే ఉన్నా.. మరినాకెందుకు ఈ వ్యాయామాలు. నీకో విషయం తెలుసా.. వ్యాయామాలు చేస్తే ఇంకా బక్కగా అయిపోతాం.. అని స్లిమ్ గా ఉండేవారు అనుకునే ఉండే సాధారణ మాటలివే. స్లిమ్ గా ఉండేవారు ఒక భ్రమలో ఉంటారు. ఈ వ్యాయామం కేవలం బక్కగా అవడానికే అని. వాస్తవానికి బక్కగా ఉండేవారు కూడా వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో తెలుసా.. బక్కగా ఉన్నామని బాధపడేవారు వ్యాయామాలు చేయడం వల్ల ఒళ్లు చేస్తారట. 

24


సరైన డైట్ తో పాటుగా, కోచ్ ఆధ్వర్యంలో వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే Cardio Workouts‌ కంటే Strength Training వల్లే మంచి ఫలితాలుంటాయని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇవే బక్కగా ఉన్నవారిని బలంగా చేస్తాయి. కాగా వీటిని మీ శక్తిని బట్టి 20 నుంచి 15 సార్లు 4 లేదా 3 సెట్లు చేస్తే మీ బాడీలో వచ్చే ఛేంజెస్ ను చూసి ఆశ్చర్యపోతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

34

స్కిప్పింగ్: స్కిప్పింగ్ కూడా మీ ఆరోగ్యవంతమైన జీవితానికి ఎంతగానో సహాయపడుతుంది. ఒక్క పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే.. అది ఎనిమిది నిమిషాల నడక నడిచినట్టని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా మీరు స్కిప్పింగ్ చేసే తాడు మీ ఎత్తుకు డబుల్ ఉండాలి. కాగా ప్రతిరోజూ ఒకే రకమైన వ్యాయామాలు కాకుండా బెచ్ ప్రెస్, క్వాట్స్, మిలటరీ ప్రెస్, డెడ్ లిఫ్ట్, డంబెల్ వంటివి చేయాలి. వీటివల్ల మీ బాడీ బలంగా మారడమే కాదు.. కండరాలు పటిష్టంగా అవుతాయి. తద్వరా మీ శరీరాకృతి అందంగా మారుతుంది. అయితే వ్యాయాలు స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే ఎక్కువగా వ్యాయామాలు చేయొద్దు. రోజు రోజుకు కొంచెం కొంచెం వ్యాయామాలు చేసే టైమింగ్స్ ను పెంచుకుంటూ పోవాలి. అప్పుడే మీరు ఫిట్ గా ఉంటారు. 

44

వాకింగ్:  క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాదు ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల బాడీలో ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో సమస్యలు మటు మాయం అవుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక అర్థగంట పాటు వాకింగ్ చేయడం వల్ల ప్రమాదకరకమైన క్యాన్సర్ జబ్బు నుంచి తప్పించుకోవచ్చు. కాగా ప్రతిరోజూ 100 నిమిషాల నడిస్తే శరీర బరువును కోల్పోవచ్చు. అంతేకాదు పాదాలకు ఎటువంటి చెప్పులు, షూస్ లేకుండా నడిస్తే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అంతేకాదు మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గడంతో పాటుగా, పొత్తి కడుపు నొప్పుల సమస్య, గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని పరిశోధనలు వెళ్లడిస్తున్నాయి. 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved