మండుతున్న ఎండలకు చల్లని బీర్ తో చిల్.. ఆ తర్వాత ఏమౌతుందో తెలుసా..?
ఎండ తాపం నుంచి బయటపడేందుకు కొంతమంది నీళ్లను, కొబ్బరి నీళ్లను, కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిస్తే.. మరికొంత మంది మాత్రం చిల్డ్ బీర్ లను ఆశ్రయిస్తుంటారు. అంతా బానే ఉన్నా.. ఈ ఎండలకు బీర్ లను తాగడం సేఫేనా..

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి రావడానికి కూడా జంకుతున్నారు. ఇక ఎండలు ముదరడంలో ప్రజలు ఎండతాపం నుంచి రక్షణపొందేందు.. డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు చల్లనీ నీళ్లను, కొబ్బరి నీళ్లను, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, కూల్ డ్రింక్ లను తాగడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ ఎండలకు చిల్డ్ బీర్ లను తాగితే బాగుంటుంది అనుకుంటారు.
నిజానికి బీర్ లో హాల్కహాల్ శాతం హార్డ్ లిక్కర్ కంటే తక్కువగానే ఉంటుంది. అలా అని పరిమితికి మించి తాగకూడదు. ఎంత తాగుతున్నామో కూడా ముఖ్యమే.
లివర్ సమస్యలుంటే.. ఇతర కాలాలతో పోల్చితే.. ఈ ఎండాకాలం మన శరీరం తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ఈ డీహైడ్రేషన్ లివర్ సమస్యలున్న వారికి ఏ మాత్రం మంచిది కాదు. కాబట్టి లివర్ సమస్యలు ఉన్నవాళ్లు బీర్ జోలికి వెల్లకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్కహాల్ ను మోతాదులోనే తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. 5 శాతం ఆల్కహాల్ 100 మి.లీ బీర్ లో ఉంటుంది. మీరు 650 నుంచి 500 మి.లీ బీరును తాగితే దాన్నుంచి మీ శరీరానికి 35 నుంచి 25 గ్రాముల ఆల్కహాల్ చేరుతుంది. ఇంత పరిమాణంలోని బీరు హార్డ్ లిక్కర్ తో సమానమట.
డీహైడ్రేషన్.. ఇది ముందే వేసవి కాలం. ఒంట్లో ఉండే నీటి శాతం తగ్గే సీజన్ కూడా. ఈ సీజన్ లో ఆల్కహాల్ తీసుకుంటే శరీరంలోని ద్రవాలు ఇట్టే బయటకు పోతుంటాయి. దీంతో మీరు తొందరగా డీహైడ్రేషన్ బారిన పడతారు. కాబట్టి ఈ సీజన్ లో ఆల్కహాల్ ను తీసుకోకపోవడమే ఉత్తమం.
నీళ్లు ఎక్కువగా.. ఒకవేళ ఈ సీజన్ లో ఆల్కహాల్ తీసుకుంటే .. అంతకు మించి నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అప్పుడే మీ శరీరం ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.
కామెర్లు.. కాలెయ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సీజన్ లో ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. వీరు ఆల్కహాల్ ను తాగితే.. కామెర్లు వచ్చే అవకాశం ఉంది.
అంతకు మించితే.. బీరు ను తాగినా.. కొంత మొత్తంలోనే సేవించాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఆల్కహాల్ 30 నుంచి 20 గ్రాముల వరకు తీసుకున్నా ఎటువంటి నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మించితేనే ఎన్నో సమస్యలు వస్తాయి.