FENNEL SEEDS: సోంపు మన ఆరోగ్యానికి ఇంత మంచి చేస్తుందా?
FENNEL SEEDS: తిన్న వెంటనే సోంపు గింజలను తినడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటీ, గ్యాస్, అజీర్థి వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.

Fennel seeds
FENNEL SEEDS: సోంపు గింజల్లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ఈ గింజలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటి సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలతో పాటుగా కాల్షియం, కాపర్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, విటమిన్ బి, ప్రోటీన్, విటమిన్ సి వంటివి అధిక మొత్తంలో ఉంటాయి.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత ఈ గింజలను తింటే ఆహారం తొందరగా అరుగుతుందట. రక్తహీనత సమస్యను తొలగించడానికి కూడా సోంపు గింజలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉండే వారు తరచుగా పాలలో కొన్ని సోంపు గింజలను కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల మీ బాడీకి కావాల్సిన ఐరన్ అందుతుంది. దీంతో రక్తహీనత (Anemia) సమస్య తగ్గుతుంది.
సోంపు గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి.. శరీరం నుంచి ప్రీ రాడికల్స్ (Pre-radicals) ను తొలగించడంతో పాటుగా చర్మంపై ఉండే ముడతలను కూడా పోగొడుతుంది. అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను సైతం అంతం చేస్తుంది.
ఇది మొటిమల కారణంగా వచ్చే నొప్పి, వాపును కూడా తగ్గిస్తుంది. ముఖంపై ముడతలు తగ్గాలంటే.. సోంపు వాటర్ తో రోజుకు ఒకసారి ముఖం కడుక్కోవాలి. ఇందుకోసం గ్లాస్ నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ సోంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ముఖం కడగాలి.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన గ్యాస్, అజీర్థి, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడానికి సోంపు వాటర్ చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది.
సోంపు గింజల్లో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలోని ప్రీరాడికల్స్ ను, టాక్సిన్లను శరీరం నుంచి బయటకు పంపించడానికి ఎంతో సహాయపడతాయి.
ఇక ఈ గింజల్లో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటుగా కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించడానికి సోంపు గింజలు చక్కగా ఉపయోగపడతాయి. ఇందుకోసం.. రాత్రి పడుకునే గంట ముందు.. గ్లాస్ గోరువెచ్చని పాలలో టీ స్పూన్ సోంపు గింజల పౌడర్ ను వేయండి. దీనికి కొంచెం బెల్లాన్ని కలిపి తాగండి.
Fennel seeds
ఈ సోంపు గింజల్లో ఉండే పాలీఫెనల్స్ డయాబెటీస్, గుండె కు సంబంధించిన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయి. గ్లాస్ గోరువెచ్చని పాలలో సోంపు గింజలను కలుపుకుని తాగితే ఎముకలు (Bones)బలంగా తయారవుతాయి.