MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ రోగాలతో ఆడవారికే ఎక్కువ ప్రమాదం.. అవేంటంటే..?

ఈ రోగాలతో ఆడవారికే ఎక్కువ ప్రమాదం.. అవేంటంటే..?

గుండె పోటు, డిప్రెషన్, మద్యపాన వ్యసనం, మోకాళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వల్ల పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 04 2022, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

కొన్ని రకాల జబ్బులు మగవారికంటే ఆడవారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవే రోగాలు పురుషులకు వచ్చినా.. వారికి పెద్దగా ప్రమాదమేమీ లేకపోవచ్చు. కానీ ఆడవారికి మాత్రం అలా కాదు. పురుషులతో పోల్చితే ఇవి ఆడవారినే ఎక్కువగా బాధిస్తాయంట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

హార్ట్ ఎటాక్.. పురుషులతో పోల్చితే ఆడవారే గుండె పోటుతో మరణిస్తున్నారని అమెరికా చేసిన ఓ అధ్యయనంలో  స్పష్టం అయ్యింది. వీరికే ముప్పు ఎందుకంటే.. ఆడవాళ్లే తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపరట. వీరిలో అధిక కొలెస్ట్రాల్ కారణంతో హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

39
ऐसे बचे हैंगओवर से

ऐसे बचे हैंगओवर से

మద్యం వ్యసనం.. ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ సేవించే ఆడవారి సంఖ్య బాగానే పెరిగిందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఈ ఆల్కహాల్ మగవారికంటే.. ఆడవారిలోనే ప్రతికూల ప్రభావం చూపెడుతుందట. దీని కారణంగా సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారట. ఇదికాస్త వీరి ఆరోగ్యాన్ని పూర్తిగా దిగజారుస్తుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

49

డిప్రెషన్.. మగవారితో పోల్చితే ఆడవారే డిప్రెషన్ తో బాధపడుతున్నారట. డెలివరీ తర్వాతనే ఆడవారు ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారట.  వీరి మనసులోని భావాలను, బాధను బయటకు చెప్పుకోలేక ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారట. 

59

ఆర్థరైటిస్.. మోకాళ్ల నొప్పులు, కండరాలు, వాపు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు మగవారికంటే ఆడవారికే ఎక్కువగా వస్తాయి. ప్రెగ్నెన్సీ తర్వాత అధిక బరువు పెరగడం, కాల్షియం లోపం ఏర్పడటం వంటి కారణాల వల్ల ఈ ఆర్థరైటిస్ సమస్య ఎక్కువగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

69

లైంగిక సంక్రమణం.. పురుషులతో పోల్చితే ఆడవారికే లైంగికంగా సంక్రమించే అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలను తొందరగా తగ్గించుకోలేరు. 

79

మానసిక ఒత్తిడి.. పలు సర్వేల ప్రకారం.. మానసిక ఒత్తిడితో మగవారికంటే ఆడవారే ఎక్కువగా బాధపడుతున్నారట. అంటే ఈ సమస్య మగవారి కంటే ఆడవారికే ఒక శాతం ఎక్కువట. ఇంటి బాధ్యత, పిలల్ల సంరక్షణ వంటి ఎన్నో విషయాల్లో మీరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారట. 

89

పక్షవాతం.. పక్షవాతం పురుషులకు, స్త్రీలకు వస్తుంది. మానసిక ఒత్తిడి, కొలెస్ట్రాల్, వారసత్వంగా, అధిక రక్తపోటు వంటి కారణాల వల్ల పక్షవాతం బారిన పడతారు.  అయితే కొన్ని కారణాల వల్ల ఆడవారే ఎక్కువగా పక్షవాతం బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. తరచుగా మైగ్రేన్ సమస్యతో బాధపడటం, గర్భనిరోధక టాబ్లెట్లను వేసుకోవడం, ఊబకాయం వంటి సమస్యల కారణంగా ఆడవాళ్లే ఈ జబ్బుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 

99
urinary tract infection

urinary tract infection

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్.. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో ఆడవారు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇది లైంగికంగా వ్యాపించే ఇన్ఫెక్షన్. వెజినా పొడిబారడం, తక్కువగా నీళ్లను తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఈ సమస్య పురుషుల్లో కనిపించినప్పటికీ.. వారికంటే రెండింతలు ఆడవారికే ఎక్కువగా వస్తుందట.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
మహిళలు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక్కడ అందరూ 100 ఏళ్లకు పైగా జీవిస్తారు... వారి హెల్త్ సీక్రెట్ ఇదే
Recommended image2
Samosa capital: మనదేశంలో సమోసాల రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Recommended image3
Necklaces: అమెరికన్ డైమండ్స్‌తో నిండిన నెక్లెస్ డిజైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved