ఇంగువతో ఈ సమస్యలన్నీ మటుమాయం..
ఇంగువతో వంటలు రుచికరంగా అవ్వడమే కాదు.. వీటితో వండిన వంటలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలనీ దూరం అవుతాయట. జలుబు, అధిక రక్తపోటు, అసిడిటి, అజీర్థి వంటి మరెన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.

ఇంగువ వంటలకు రుచిని అందించడమే కాదు మనల్ని మరెన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇంగువను వంటలోనే కాదు మెడిసిన్ లో కూడా ఉపయోగిస్తారట. ఎందుకంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇంగువతో ఎలాంటి సమస్యలు నయమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో అధిక వేడి ఉన్న వారికి ఇంగువ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. మీకు తెలుసా.. మన శరీరంలో వేడి పెరిగితే కణాలు నశించిపోతుంటాయి. కాబట్టి మీరు మీ ఒంట్లో వేడి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
జలుబు నుంచి తొందరగా ఉపశమనం పొందాలంటే ఇంగువని వంటల్లో వేసుకుని తినండి. దగ్గు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలున్న వారికి ఇంగువ చక్కటి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది.
గ్యాస్ట్రిక్, మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలు దూరం అవ్వాలంటే ప్రతిరోజూ మీ వంటల్లలో ఇంగువను వేసి తినండి.
హైబీపీ సమస్యతో బాధపడేవారికి ఇంగువ ఎంతో సహాయపడుతుంది. ఇంగువ బ్లడ్ ప్రెజర్ తగ్గడం, పెరగడం వంటి సమస్యలు చోటు చేసుకోకుండా చూస్తుంది.
అంతేకాదు ఇంగువ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. మన బాడీలో ఉండే చెడు బ్యాక్టీరియాను సైతం ఇది చంపేస్తుంది. అంతేకాదు ఇది జుట్టును బలంగా, ధ్రుడంగా చేసి పొడవుగా పెరగడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలర్జీ సమస్య ఉన్న వారు కూరల్లో ఇంగువను వేసుకుని తింటే ఈ సమస్యనుంచి ఈజీగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై దద్దుర్లు వస్తుంటే అ ప్లేస్ లో కాస్త ఇంగువ పొడి తీసుకుని అందులో కొబ్బరి నూనె మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసి అప్లై చేయాలి. క్షణంలో దద్దుర్లు మటుమాయమవుతాయి
పిల్లలు పెద్దలు అంటూ తేడా లేకుండా కొంతమంది నులిపురుగుల సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారు.. ఒక గ్లాస్ వాటర్ లో టీస్పూన్ ఇంగువను కలిపి తాగితే ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. కూరల్లో ఇంగువ వేసుకుని తిన్నా నులిపురుగుల సమస్య నుంచి బయటపడొచ్చు.
మలబద్దకం సమస్యతో బాధపడేవారికి ఇంగువ చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. వీరు పడుకునే ముందు ఇంగువ చూర్ణం తింటే దీని నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు.