రోజూ 20 నిమిషాలు సైకిల్ తొక్కితే ఏమౌతుంది?
సైక్లింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి, రోజూ సైక్లింగ్ చేయడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
సైక్లింగ్
ఆరోగ్యంగా ఉండాలంటే మనం కచ్చితంగా పోషకాహారం తీసుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. మనం ఎంత పోషకాహారం తీసుకున్నా కూడా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. వ్యాయామం రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉండగలం. ఈ వ్యాాయామాల్లో సైకిల్ తొక్కడం కూడా ఒకటి.
మన పూర్వీకులు గతంలో ఎన్ని కిలోమీటర్లు అయినా నడిచి వెళ్లేవారు.. లేదంటే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవారు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనకు సైకిల్ తొక్కే అవసరం లేదు. కానీ.. ఆరోగ్యం గా ఉండాలంటే మాత్రం చేయాల్సిందే. మరి, ప్రతిరోజూ 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...
సైక్లింగ్
ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు. సైక్లింగ్ ఆరోగ్యానికి చాలా మంచి వ్యాయామం. ఎందుకంటే సైకిల్ తొక్కినప్పుడు శరీరం మొత్తం పనిచేస్తుంది.సైక్లింగ్ వల్ల కండరాలు బలపడతాయి, శరీరంలోని అన్ని భాగాలు దృఢంగా తగులుతాయి. రోజూ సైక్లింగ్ చేస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:
ఇప్పుడు చాలా మందిని, ముఖ్యంగా పెద్దవారిని వేధించే సమస్య కీళ్ల నొప్పులు. మోకాళ్ల నొప్పుల వల్ల చాలా మంది నడవలేకపోతున్నారు. రోజూ సైకిల్ తొక్కితే ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
సైక్లింగ్
మీకు కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే, వైద్యుల సలహా తీసుకుని సైక్లింగ్ చేయండి. బయట కాకుండా ఇంట్లో లేదా జిమ్‌లో సైక్లింగ్ చేయవచ్చు. సైక్లింగ్ మంచి కార్డియో వ్యాయామం, ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
సులభంగా బరువు తగ్గండి:
మీరు బరువు తగ్గాలనుకుంటే, రోజుకి 20 నిమిషాలు సైకిల్ తొక్కడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. రోజూ సైకిల్ తొక్కితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.