చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..?
ఒకరిని ఎంకరేజ్ చేయడానికి, ఉత్సాహపరచడానికి కొట్టే చప్పట్లు మనల్ని ఎన్నో నారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయన్న ముచ్చట మీకు ఎరుకేనా..?

మన మందరం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పనులను చేస్తుంటాము. ముఖ్యంగా వ్యాయామం, వాకింగ్ , జాగింగ్ వంటి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటాము. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. వీటితో పాటుగా చప్పట్ల వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీన్నే ది క్లాపిన్ థెరపీ అంటారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సాధారణంగా మనం ఇతరులను ప్రోత్సహించడానికి, ఉత్సాహపరచడానికే చప్పట్లు కొడతారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మందికి తెలియదు.
చప్పట్లు కొట్టడం మీ ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది: ఆరోగ్యం బాగుండటానికి మీరు ఉదయాన్నే చప్పట్లు కొట్టొచ్చు. ఇది మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. ఉదయాన్నే చప్పట్లు కొట్టడం వల్ల శరీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: మీరు వజ్రాసనం లేదా సుఖాసనం లో కూర్చున్నప్పుడు కూడా చప్పట్లు కొట్టొచ్చు. ప్రతి రోజూ ఉదయం పూట ఇలా చేయొచ్చు. అధిక బరువు ఉన్నవారు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా చప్పట్లను కొట్టొచ్చు. ఎందుకంటే వీరు ఏవిధమైన శారీరక వ్యాయామం చేయలేరు. కాబట్టి చప్పట్లు కొట్టడం ద్వారా వారి రక్త ప్రసరణను మెరుగుపరచుకోవచ్చు. తద్వారా అధిక రక్తపోటు లేదా హైపోటెన్షన్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.
మరింత ఎనర్జిటిక్ గా ఉండగలం: మానవ శరీరానికి అనేక శక్తి కేంద్రాలు ఉంటాయి. చప్పట్లు వాటిని ఉత్తేజపరచడానికి సహాయపడుతాయి. ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు చప్పట్లు కొడితే మీరు మరింత ఎనర్జిటిక్ గా మారుతారు.
మానసిక ,శారీరక ఆరోగ్యానికి సహాయపడుతుంది: మనస్సు, శరీరం రెండూ ఫిట్ గా ఉన్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాగా చప్పట్లు కొట్టడం వల్ల మనస్సు, శరీరాన్ని బలోపేతం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఉదయం చప్పట్లు కొట్టడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఎలాంటి నెగిటీవ్ ఆలోచనలు రాకుండా చూస్తుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: చప్పట్లు కొట్టేటప్పుడు చేతులలోని అన్ని బిందువులను తాకడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చప్పట్లు కొట్టడం రక్త ప్రసరణను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మధుమేహం, ఆస్తమా, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ మొదలైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
జుట్టు రాలే సమస్య ఉండదు: చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల రక్త కణాలు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. సరైన మొత్తంలో ఆక్సిజన్ పొందడంతో పాటు శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ప్రతిరోజూ చప్పట్లు కొట్టడం వల్ల జలుబు, జుట్టు రాలడం, శరీర నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.