వర్షాకాలంలో ఈ రోగాలు రాకూడదంటే.. కాకరకాయను ఖచ్చితంగా తినాల్సిందే..!
కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నా.. ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కాకరకాయ చేసే మేలు మరే కూరగాయ చేయదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలం రానే వచ్చింది. దీంతో పాటుగా సీజనల్ వ్యాధులు కూడా ఎంట్రీ ఇచ్చేశాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాదు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు కూడా సోకుతుంటాయి. ఈ వ్యాధుల బారిన పడకూడదంటే మనలో రోగ నిరోధక శక్తి బాగుండాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తినాలి.
ముఖ్యంగా నిల్వ ఉన్న ఆహారాలను తినకూడదు. ఏ పూటకు ఆపూట వండుకుని తినాలి. అయితే ఈ సీజన్ లో కాకరకాయను తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాకరకాయ ఎన్నో సీజనల్ వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కానీ కాకరకాయ అంటేనే ముఖం వికారంగా పెట్టే వారు చాలా మందే ఉన్నారు. చేదుగా ఉంటుందని దీని దిక్కే చూడని వారు కూడా బాగానే ఉన్నారు. మనల్ని పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంచే కాకరకాయను ఈ వర్షాకాలంలో తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్ లో కాకరకాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
వైరస్, ఇన్ఫెక్షన్స్, సీజనల్ రోగాల నుంచి మనల్ని కాకరకాయ కాపాడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కాకరలో ఉండే చేదు గుణం మన కడుపులో ఉండే క్రిమి కీటకాలను, నులిపురుగులను చంపేస్తుంది.
ఇక కాకరకాయ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వారికి చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే కాకరకాయను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ బాగా పెరగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయ గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కామెర్లు, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు సోకకుండా మనల్ని కాపాడుతుంది.
ఇక కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణసంబంధ సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయడుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడేవారు తరచుగా కాకరకాయను తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కాకరకాయ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల రాళ్లు చాలా తొందరగా కరిగిపోతాయి.
కాకరకాయ మధుమేహులకు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. వీళ్లు కాకరకాయను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ కాలంలో రెండు రోజులకోసారి కాకరకాయను తింటే ఎలాంటి సీజనల్ వ్యాధులు మిమ్మల్ని చుట్టుకునే అవకాశమే ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.