MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Headache: తలనొప్పి వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి..

Headache: తలనొప్పి వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి..

Headache: తలనొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. కారణమేదైనా తలనొప్పి మాత్రం మనల్ని కుదురుగా ఉండనివ్వదు. అయితే దీన్ని తొందరగా తగ్గించే ఉపాయాలు కొన్ని ఉన్నాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పని ఒత్తిడి, ఫోన్ లేదా ల్యాప్ టాప్ వంటి స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం వల్ల తలనొప్పి రావడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే తలనొప్పిని త్వరగా తగ్గించే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూసేయండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మసాజ్ (Massage)

మసాజ్ ద్వారా కూడా తలనొప్పిని చిటికెలో తగ్గించుకోవచ్చు. మసాజ్ వల్ల తలనొప్పికి కారణమయ్యే శరీరంలోని ఏభాగం ఒత్తిడిని లేదా కండరాల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇది తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. 

38

ఐస్ ప్యాక్ (Ice pack)

ఐస్ ప్యాక్ కూడా తలనొప్పిని తొందరగా తగ్గిస్తుంది. ఇందుకోసం ఐస్ ప్యాక్‌ ను రుమాలు లేదా టవల్‌తో చుట్టి నొప్పిగా ఉండే చోట కాసేపు పెట్టండి. ఇది మీకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. 
 

48

లావెండర్ ఆయిల్ (Lavender oil) ను ఉపయోగించండి

అరోమాథెరపీ కూడా మీ తలనొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు విశ్రాంతినిచ్చేందుకు సహాయపడే ఏదైనా ఇతర సువాసనను ఉపయోగించినా తలనొప్పి చిటికెలో తగ్గుతుంది. 
 

58

నీళ్లు తాగండి

డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. అందుకే అలాంటి సమయంలో నీళ్లన ఎక్కువగా తాగండి. అలాగే  కొబ్బరి నీళ్లు లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రోలైట్ కలిగిన పానీయాన్ని తాగండి. ఇవి మిమ్మల్ని తొందరగా తలనొప్పి నుంచి బయటపడేస్తాయి. 
 

68

శ్వాస వ్యాయామాలు (Breathing exercises)

తలనొప్పి వచ్చినప్పుడు నెమ్మదిగా.. లోతుగా శ్వాస పీలుస్తూ.. నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇది మీ తలనొప్పికి కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

78

కాసేపు పడుకోండి

నిద్రలేకపోవడం వల్ల కూడా తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది. అందుకే మీ నిద్ర షెడ్యూల్ ను మార్చకండి. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. నిద్రతోనే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. 
 

88

టీ

చమోమిలే లేదా అల్లం వంటి స్టీమింగ్ కప్ హెర్బల్ టీలో తలనొప్పిని తగ్గించే ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ టీలను తాగితే తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved