MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • belly fat: గ్రీన్ టీ ఒక్కటి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

belly fat: గ్రీన్ టీ ఒక్కటి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

belly fat: గ్రీన్ టీ ఎన్నో ఔషద గుణాలుంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు సోకే  ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు ఇది  బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుందని కొందరు అంటుంటారు.  కానీ ఇది వాస్తవం కాదంటున్నారు నిపుణులు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 14 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బరువు పెరగడం చాలా సులువు కానీ.. తగ్గడం మాత్రం అంత సులువు కాదు. దీనికోసం సరైన ఆహారం, వ్యాయామం వంటివి రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. బరువు తగ్గడం ( Weight Loss ) వల్ల తీవ్రమైన అలసట కలుగుతుంది. అయినా పొట్ట కొవ్వు మాత్రం తగ్గదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సాధారణంగా బెల్లీ ఫ్యాట్..  పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల వస్తుంది. దీన్ని తగ్గించుకోవాలంటే సరైన వ్యాయామం, ఆహార నియమాటను పాటించాల్సి ఉంటుంది. అయితే బరువును తగ్గేందుకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం గ్రీన్ టీ ఒక్కటి చాలంటారు చాలా మంది. 
 

37

నిజానికి గ్రీన్ టీ లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ , మధుమేహం, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి జబ్బులు సోకే ప్రమాదం తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. గ్రీన్ టీ చర్మ ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయినప్పటికీ గ్రీన్ టీని బరువు తగ్గించే పానీయంగానే భావిస్తారు చాలా మంది. మరి ఈ గ్రీన్ టీ బరువు తగ్గేందుకు నిజంగానే సహాయపడుతుందా ? లేదా ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

47

వాస్తవానికి గ్రీన్ టీ బరువు తగ్గించే పానీయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ కేవలం బరువు తగ్గించే ప్రయత్నాలను మాత్రమే వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ  గ్రీన్ టీ మాత్రమే తాగడం వల్ల బరువు తగ్గుతారనేది పూర్తిగా మన అపోహే అంటున్నారు నిపుణులు. ఇది బరువు తగ్గడానికి ఏ మాత్రం సహాయపడదని నొక్కి చెబుతున్నారు. 

57

గ్రీన్ టీ తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతారు. కానీ దీనిపై ఇంత వరకు ఎలాంటి అధ్యయనాలు బయటకు రాలేదు. కేవలం ఏదైనా ఆహారం లేదా పానీయాలను తీసుకోవడం లేదా తీసుకోకపోవడం వల్ల ఎప్పటికీ బరువు తగ్గలేరు. బరువు తగ్గాలంటే మీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే కేలరీల మొత్తంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.  అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

67

టీ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో ఉంటే పాలు, చక్కెరలు బరువు పెరగడానికి, ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీని తాగుతున్నారు. అయితే గ్రీన్ టోని కొన్ని పదార్థాలు బరువు తగ్గడంపై మాత్రమే సానుకూల ప్రభావాన్నిచూపుతాయి. కానీ బరువును మాత్రం తగ్గించలేవు. ఈ గ్రీన్ టీ బరువును తగ్గించే పానీయంగా తయారుచేయలేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 

77

'సమతుల్య ఆహారం' అయిన పండ్లు, కూరగాయలను పుష్కలంగా తీసుకోవాలి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామాలు చేయాలి. శరీరానికి సరిపడా నీళ్లను తాగాలి. కండినిండా నిద్రపోవాలి. ఇవన్నీ బరువు తగ్గించే ప్రయత్నాలకు దోహదపడతాయి. ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తేనే ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken : స్కిన్డ్ చికెన్ vs స్కిన్ లెస్ చికెన్.. ఏది తినడం హెల్త్ కి బెటరో తెలుసా?
Recommended image2
Hotel Secrets: హోటల్ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ ఎందుకు దొర్లించాలి?
Recommended image3
Gas Safety: గ్యాస్ స్టవ్ దగ్గర ఇవి అస్సలు పెట్టొద్దు.. జాగ్రత్త సుమా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved