Sink Cleaning Tips: సింక్ పసుపు రంగులోకి మారిపోయిందా? ఈ చిన్న చిట్కాలతో తళ తళ లాడించేయండి
వాష్ బేసిన్లో లేదా సింక్ (Sink).. కొన్ని రోజులు వాడాక రంగు మారిపోతుంది. పసుపు రంగులో మారిన సింక్ ను చాలా సులభంగా మీరు శుభ్రం చేయవచ్చు. దీనికోసం కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.

సింక్ క్లీనింగ్ టిప్స్
ఇంటికి శుభ్రంగా ఉంచుకుంటేనే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఇంటి శుభ్రతలో సింక్ క్లీన్ చేసుకోవడం కూడా ముఖ్యమే. సింక్ లో అధికంగా మురికి పేరుకుపోతుంది. అవి పసుపు రంగులోకి మారిపోతాయి. జారుడుగా మురికి పట్టి చూడడానికే అసహ్యంగా ఉంటాయి. అలాంటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే సింకులను చాలా సులభమైన పద్ధతిలో ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకోండి.
నిమ్మరసం
ఇంట్లోనే వాష్ బేసిన్లను క్లీన్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. చిన్న చిట్కాల ద్వారా అందులో ఉన్న మురికిని తొలగించవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఆ రసాన్ని సింకులో చల్లండి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మురికిని త్వరగా తొలగించేలా చేస్తుంది. ఆ నిమ్మరసం చల్లుకుని పీచు పట్టుకొని తోమితే మురికి అంతా పోతుంది.
డిష్ డిటర్జెంట్
ఇంట్లో గిన్నెలు తోమేందుకు వాడే డిష్ డిటర్జెంట్ సోపు లేదా పొడి లిక్విడ్ ని కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. వాటిని ముందుగా సింక్ పై అప్లై చేయాలి. తర్వాత మందపాటి పీచుతో తోమితే మురికి త్వరగా పోతుంది.
వైట్ వెనిగర్
మార్కెట్లో బయట వెనిగర్ దొరుకుతుంది. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఇది మంచి క్లీనింగ్ పదార్థంగా ఉపయోగపడుతుంది. వాష్ బేసిన్లలో ఈ తెల్ల వెనిగర్ ను చల్లి రుద్దితే మీ సింక్ తళ తళలాడిపోతుంది. ఇది తుప్పు మరకలను కూడా పోగొడుతుంది.
బేకింగ్ సోడా
పసుపు రంగులో మారిన సింక్ లను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా ఉత్తమమైనది. బేకింగ్ సోడాను పీచుపై చల్లుకొని దాంతోనే వాష్ బేసిన్లను రుద్దండి. రెండు నిమిషాల్లో వాష్ బేసిన్ కొన్న మురికి మొత్తం పోయి మెరవడం మొదలవుతుంది.