దాంపత్య జీవితం బాగుండాలంటే ఇలా చేయండి.. మీ మధ్య విడదీయరాని ప్రేమ కలుగుతుంది
జాతకంలో గ్రహాల స్థానం బాగోలేకపోతే దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని జ్యోతిష్యంలో నమ్ముతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్యంలో చెప్పబడ్డాయి. ఈ పరిహారాలు చేస్తే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.
మీకు, మీ భాగస్వామికి మధ్య ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరిగినా లేదా ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా కుటుంబంలో కలహాలు ఏర్పడితే మీ గ్రహాలు సరిగ్గా లేవని అర్థం చేసుకోవాలి. రోజువారీ గొడవలు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని పరిహారాలు చేస్తే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే?
తులసి మొక్క
తులసి మొక్కను హిందూమతంలో పవిత్రమైన మొక్కగా భావిస్తాయి. రోజువారీ గొడవల నుంచి బయటపడటానికి తులసి మొక్కకు ప్రతిరోజూ నీళ్లను పోయండి. దీనితో పాటుగా 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని కూడా జపించండి.
రాధా-కృష్ణుడి చిత్రపటాలు
మీ మధ్య నిత్యం గొడవలు జరిగితే మీ పడకగదిలో రాధా-కృష్ణుడి చిత్రాన్ని పెట్టండి. దీనివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే గొడవలు కూడా తగ్గుతాయి. అలాగే రావి, అరటి చెట్లను పూజిస్తే కూడా వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
దుర్గా చాలీసా
పెళ్లైన ఆడవారు ప్రతిరోజూ దుర్గా చాలీసాను పఠించి దుర్గామాత 108 నామాలను జపిస్తే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో విడదీయరాని ప్రేమ పెరుగుతుంది.
camphor-vastu
శుక్రవారం నాడు
శుక్రవారం రెండు కర్పూరం ముక్కలను మట్టి దీపంలో వేసి కాల్చండి. ఆ తర్వాత ఇంటి మొత్తం ధూపం వేయండి. తర్వాత దానిని బయటకు తీయండి. ఇది వైవాహిక జీవితంలోని చెడు దృష్టిని తొలగిస్తుంది. అలాగే సంబంధంలో మాధుర్యాన్ని కాపాడుతుంది.