MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోయేలా చేసే చిట్కాలివిగో..

జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోయేలా చేసే చిట్కాలివిగో..

చండ్రు సమస్య నుంచి విముక్తి పొంది.. జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా, షైనీగా తయారవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించి మీ జుట్టు ఒత్తుగా, అందంగా మెరిపోయేలా చేయండి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 22 2022, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

చలికాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య హెయిర్ ఫాల్, విపరీతమైన చుండ్రు. వీటికి తోడు జుట్టు నిర్జీవంగా తయారవడం, చిట్లిపోవడం, పొడి బారడం. ఈ సమస్యల మూలంగానే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అందుకే ఈ చలికాలంలో జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం ఎంతో ముంఖ్యం. జుట్టు గానీ, చర్మం గానీ పొడిబారకుండా, డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని రకాల ఆహారాలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. 
 

29

చలికాలమని చాలా మంది నీళ్లను పూర్తిగా తాగడమే మానేస్తుంటారు. ఎప్పుడో తిన్నప్పుడే నీళ్లు తాగాలన్న ధ్యాస ఉంటుంది. కానీ కాలాలతో సంబంధం లేకుండా నీళ్లను తాగితే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే మన జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లను తాగుతూ ఉండండి. 

39

ఒకవేళ మీరు నీళ్లను తాగలేదనుకో మీ జుట్టకు తేమ లేకపోవడంతో రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొడిబారుతుంది. అంతేకాదు దీంతో మీరు చుండ్రు సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ డాండ్రఫ్ కారణంగా నెత్తిలో దురద పెట్టడంతో ఇరిటేన్ కూడా వస్తుంది. మరి ఈ చండ్రు సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం జుట్టును ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి.
 

49

జుట్టు ఆరోగ్యానికి నీరెంత అవసరమో.. పోషకాహారం కూడా అంతే అవసరం. తాజా పండ్లు, కూరగాయల్లో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బి, సి, ఇ, డి లు ఎంతో అవసరం. వీటిని ప్రతి రోజూ తీసుకుంటేనే మీ జుట్టు సేఫ్. 

59

హెయిర్ ఫాల్ సమస్య తలెత్తొదంటే మాత్రం జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. వీటిని తరచుగా తింటే మన శరీరానికి అందాల్సిన Nutrients‌ అందవు. ఫలితంగా మీ జుట్టు నిర్జీవంగా మారుతుంది. పొడిబారిపోతుంది. దీంతో మీ జుట్టు సహజసిద్దమైన మెరుపు కోల్పోతుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ సమస్య కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు జంక్ ఫుడ్ ను తినకూడదు. 
 

69

జుట్టు ఆరోగ్యానికి ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, సెలీనియం, మాంగనీస్, జింక్ వంటివి ఎంతో అవసరం. ఇవి బ్రస్సెల్ మొలకలు, అవకాడో, బయోటిన్, సీఫుడ్ వంటి వాటి ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా కేశాల సంరక్షణకు విటమిన్ డి చాలా అవసరం.  దీని ద్వారానే జుట్టు ఆరోగ్యంగా, షైనీగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం  కాసేపు ఎండలో కూర్చోండి. మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. 

79

జుట్టు, చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే విటమిన్ డి బయోటిన్ ఎంతో అవసరం. కాగా మన శరీరంలో ఈ బయోటిన్ లోపిస్తే జుట్టు, చర్మం, గోర్లు కాంతినిన కోల్పోతాయి. దాంతో గోర్లు పేలవంగా మారితే, జుట్టు పెళుసుగా తయారవుతుంది. 

89

చాలా మంది చలిని తట్టుకోలేక వేడినీళ్లతో హెడ్ బాత్ చేస్తుంటారు. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు డ్రైగా మారుతుంది. ముఖ్యంగా తల స్నానం చేసినప్పుడు జుట్టు తడిగా ఉన్నప్పుడే జుట్టును దువ్వకూడదు. అలా దువ్వితే జుట్టు బలహీనంగా మారుతుంది. అంతేకాదు జుట్టు చాలా ఊడుతుంది.
 

99

చాలా మంది జుట్టును ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వారు వీటిని ఉపయోగించకూడదు. వీటికి బదులుగా మెత్తగా ఉండే కాటన్ క్లాత్ తో జుట్టును తుడుచుకుని ఆరబెట్టుకోవడం ఉత్తమం. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ ఇదిగో
Recommended image2
Snoring: మీ గురకతో ఎదుటివారికి ఇబ్బందులా? ఇవి ఫాలో అయితే తిట్లు తప్పుతాయి.
Recommended image3
వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved