MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair : ఒత్తైన జుట్టు కోసం సూపర్ టిప్స్..

Hair : ఒత్తైన జుట్టు కోసం సూపర్ టిప్స్..

Hair : అమ్మాయిలకైనా.. అబ్బాయిలకైనా జుట్టుతోనే అందం.. జుట్టుంటేనే ఆనందం. అందుకోసమే జుట్టుకోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. మరి మీకు కూడా ఒత్తైనా జుట్టు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ సూపర్ టిప్స్ మీ కోసమే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 08 2022, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Hair : ప్రస్తుత కాలంలో చాలా మంది యువతీ యువకులు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెకేందుకు ఎన్నో రకాల టిప్స్ పాటిస్తున్నారు. అయితే మనలో చాలా మంది జుట్టు సంరక్షణా చర్యలలో చాలా తప్పులు చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ వల్లే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కేశ సంరక్షణ చర్యలను తీసుకుంటే ఈజీగా హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాదు ఒత్తైనా, పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు సంరక్షణ చర్యలలో తగు జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

25

కాలాలతో సంబంధం లేకుండా చాలా మంది వేడినీళ్లతో స్నానం చేసేస్తుంటారు. కానీ చలికాలం వేడినీటితో తన స్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వేడి నీళ్లతో తలస్నానం చేయడంతో కుదుళ్లు పట్టు కోల్పోతోంది. అంతేకాదు స్కిన్ పొడిబారుతుంది. తద్వారా హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకే ఎక్కువ వేడిగా ఉండే నీళ్లకు బదులుగా గోరువెచ్చగా ఉండే నీళ్లనే తలస్నానానికి ఉపయోగించండి.
 

35

ప్రస్తుత కాలంలో జుట్టుకు నూనె రాయడమే మర్చిపోయారు.  ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఫ్యాషన్ గా మారిందన్నమాట. ఈ కారణం చేతనే చాలా మంది జుట్టుకు నూనె రాయడమే మర్చిపోతున్నారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. ఎందుకంటే వెంట్రుకలకు నూనె రాయకపోవడం వల్ల జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు జుట్టు కుదుళ్లు కూడా బలహీనంగా అవుతాయి. ఈ సమస్యలు రాకూడదంటే.. వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు వెంట్రుకల కుదుళ్లు కూడా ధ్రుడంగా అవుతాయి. అంతేకాదు నూనె రాయడం వల్ల తలనొప్పి మటుమాయం అవుతుంది. ముఖ్యంగా వెంట్రుకలు తెల్లబడే సమస్యే ఉండదు. 

45

జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉండాలంటే జుట్టును అప్పుడప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. ట్రిమ్ చేయడం వల్ల జుట్టు లావుగా మారుతుంది. ఇకపోతే జుట్టును దువ్వేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జుట్టును గట్టిగా, రఫ్ గా దువ్వితే జుట్టు ఊడిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా పళ్ల మధ్యన సందు ఎక్కువగా ఉండే దువ్వెనతోనే చిక్కులు తీసుకోవాలి. లేదంటే జుట్టు ఊడిపోయే అవకాశముంది. ఇకపోతే తలస్నానం చేసిన వెంటనే వెంట్రుకలను అస్సలు దువ్వకూడదు. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతనే జుట్టును దువ్వుకోవాలి. ఇకపోతే చాలా మంది జుట్టు అందంగా కనిపించాలని కర్లింగ్ చేస్తుంటారు. తరచుగా ఇలా చేయడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా జుట్టు స్టైల్ కోసం ఉపయోగించే టూల్స్ తో హెయిర్ దెబ్బతినే ప్రమాదముంది. 

55

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే మాత్రం మనం తీసుకునే ఆహారం ఎక్కువ పోషకవిలువలు కలిగినదై ఉండాలి. ఎందుకంటే జుట్టు ఒత్తుగా, అందంగా ఉండటానికి పోషకవిలువలు కలిగిన ఆహారం ఎంతగానో సహాయపడుతుంది. పాలు, గుడ్లు, దుంపలు, చేపలు, ఆకు కూరలు వంటివి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తారు. కాగా అధిక పోషకాలుంటే ఆహారం వల్ల హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు చిన్న ఏజ్ లో వెంట్రుకలు తెల్లబడే సమస్య రాదు. కాబట్టి మీ రోజు వారి ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఉండేలా చూసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Boost Testosterone: మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే 5 సూపర్ ఫుడ్స్ ఇవిగో
Recommended image2
బంగారం, వెండి కాదు.. ఈ ముత్యాల చోకర్ తో మీ లుక్ అదిరిపోతుంది
Recommended image3
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved