MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair growth tips: సహజంగా జుట్టు పెరగాలంటే ఇలా చేయండి..

Hair growth tips: సహజంగా జుట్టు పెరగాలంటే ఇలా చేయండి..

Hair growth tips: ప్రస్తుత కాలంలో  హెయిర్ ఫాల్ సమస్య సర్వసాధారణంగా మారింది. జుట్టు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నా.. జుట్టు ఒత్తుగా , బలంగా పెరగాలంటే టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 21 2022, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Hair growth tips: ఆడ, మగ అంటూ తేడా  లేకుండా ఒత్తైన జుట్టు కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ పోషకలేమి ఆహారం, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. అయితే ఈ హెయిర్ ఫాల్ సమస్య తగ్గి.. ఒత్తైన జుట్టు కావాలంటే మాత్రం కొన్ని చిట్కాలను పక్కాగా ఫాలో అవ్వాల్సిందే. అవేంటంటే.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కలబంద జ్యూస్.. కలబందలో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ లు కుదుళ్లను రిపేర్ చేసి..  వెంట్రుకలు ఫాస్ట్ గా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు కుదుళ్లను కూడా బలంగా చేస్తుంది. అందుకే ఒక గ్లాస్ కలబంద జ్యూస్ ను ప్రతిరోజూ ఉదయం పూట తాగండి. 
 

37

బాదం, అరటిపండు.. ఈ రెండింటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఖణిజాలు, జింక్ వంటివి కూడా అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. బాదం పప్పుల్లో ఉండే విటమిన్ ఇ  కెరాటిన్ ఉత్పత్తికి సహయకరిస్తుంది. దీంతో దుబ్బతిన్న జుట్టు నయం అవుతుంది. 
 

47

ఇకపోతే అరటి పండ్లలో ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, పొడుగ్గా చేసేందుకు ఎంతో సహాయపడతాయి. అరటి పండు, పాలు, దాల్చిన చెక్క పౌడర్, నట్స్, తేనె, సీడ్స్, బాదం పప్పులను వేసి బనానా స్మూతీని చేసుకుని తాగండి.. తేడాను మీరే గమనిస్తారు. 
 

57

ప్రోటీన్ ఆహారం.. కెరాటిన్ 95 శాతం, అమైనో ఆమ్లాలు 18 శాతంతో మన జుట్టు తయారవుతుంది. కాబట్టి మీ జుట్టుకు అవసరమయ్యే ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉండండి. ఇందుకోసం గింజలు, చెకెన్, పాలు, గుడ్లు జున్ను, పౌల్ట్రీ, పెరుగు, క్వినోవా లను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. 

67

బార్లీనీరు తాగండి.. బార్లీలో ఉండే రాగి, ఇనుము కుదుళ్లను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఎర్ర రక్తకణాల సంఖ్యను కూడా పెంచుతాయి. అంతేకాదు ఇవి జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తాయి. ఇందుకోసం కొన్ని నీళ్లను తీసుకుని అందులో బీర్లీని, కాస్త ఉప్పు వేయాలి. 30 నిమిషాల పాటు వీటిని ఉడకబెట్టాలి. ఆ తర్వాత వాటిని కిందికి దింపేసి అందులో నిమ్మ, తేనెను కలిపి తీసుకోవాలి. తరచుగా ఇలా చేస్తే మీ జుట్టు బాగా పెరుగుతుంది. 

77

మెంతులు.. మెంతుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, ఖనిజాలు వంటి ముఖ్యపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును రిపేర్ చేసి.. బలంగా పెరగడానికి సహాయపడతాయి. ఇందుకోసం టీస్పూన్ మెంతులను తీసుకుని గ్లాస్ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. వీటిని ఉదయం  తినాలి. లేదంటే కూరల్లో మసాలాగా వేసుకుని తీసుకోవచ్చు కూడా.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Recommended image3
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved