Hair Care: వీటిని తింటే బట్టతల వస్దుందన్న టెన్షనే ఉండదు తెలుసా..
Hair Care: ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సమస్య అమ్మాయిల్లోనే కాదు అబ్బాయిల్లో కూడా కనిపిస్తోంది. ఇక అబ్బాయిలకు జట్టు ఊడిపోతుందంటే చాలు బట్టతల వస్తుందేమోనన్న భయం పుట్టుకొస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

ప్రస్తుత కాలంలో ఒత్తైన, పొడవైన జుట్టు ఉండటమే గగణమైపోయింది. మారుతున్న జీవనశైలి, వాతారణ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల మూలంగా జుట్టు ఊడిపోతుంటుంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో లభించే రకరకాల ప్రొడక్ట్ లను ఉపయోగిస్తుంటారు. అయినా జుట్టు ఊడటం ఆగిందా అంటే అది చెప్పలేము. కొందరికీ హెయిర్ ఫాల్ సమస్య పోవచ్చు. మరికొందరకీ అలాగే ఉండొచ్చు.
అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే జుట్టు సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. ముఖ్యంగా బలమైన పోషకాహారం తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య పోవడమే కాదు జుట్టు నిర్జీవంగా మారడం వంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా ఐదు రకాల ఆహార పదార్థాలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా, షైనీగా తయారవుతుంది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
గుడ్లు.. గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. ఈ గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12, సెలీనియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును బలంగా ఉంచుతాయి. హెయిర్ ఫాల్ సమస్యను కూడా తగ్గిస్తాయి. కాబట్టి రోజుకు ఒక గుడ్డు తింటే మీ జుట్టు సేఫ్ గా ఉంటుంది.
వేరుశెనగ, పీనట్ బటర్.. పీనట్ బటర్ లేదా వేరు శెనగలను మీ రోజు వారి ఆహారంలో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఇ, ప్రోటీన్లు, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తాయి.
పాలకూర.. పొడవైన, ఒత్తైన జుట్టుకోసం ట్రై చేస్తున్నవారు తమ రోజు వారి ఆహారంలో తప్పకుండా పాలకూరను ఉండేలా చూసుకోవాలి. పాలకూరలో ఫోలేట్ , ఐరన్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును బలంగా ఉంచుతాయి. హెయిర్ పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్.. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, మంచి కొవ్వులు వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టుకు పోషణనిస్తాయి. దీంతో జుట్టు ఊడిపోయే సమస్య, డ్రై హెయిర్ వంటి సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి వీటిని మీ రోజు వారి ఆహారంలో తప్పక చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సిట్రస్ ఫ్రూట్స్.. అన్నిపండ్లలో సిట్రస్ పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. ఈ సిట్రస్ పండ్లలో నిమ్మకాయ, దానిమ్మ, ఆరెంజ్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సిట్రస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి సెల్స్ డ్యామేజ్ ను నివారిస్తాయి. అలాగే జుట్టు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడతాయి.