MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Hair Care Tips: తలస్నానం చేసేటప్పుడు ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే.. జుట్టు రాలమన్నా రాలదు!

Hair Care Tips: తలస్నానం చేసేటప్పుడు ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే.. జుట్టు రాలమన్నా రాలదు!

Hair Care Tips: ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ వాడినా చాలామందికి ఫలితం ఉండదు. కానీ తలస్నానం చేసేటప్పుడు ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 12 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ టిప్స్ తో జుట్టు రాలే సమస్యకు చెక్
Image Credit : Getty

ఈ టిప్స్ తో జుట్టు రాలే సమస్యకు చెక్

గజిబిజి లైఫ్ స్టైల్, కాలుష్యం, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చాలామందికి జుట్టు రాలే సమస్య ఎదురవుతుంటుంది. కానీ ఈ సమస్యకు కొన్ని సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ చిట్కాలతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుందట. మరి ఆలస్యమెందుకు ఆ చిట్కాలు మీరు ట్రై చేయండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గోరువెచ్చని నీటితో తలస్నానం
Image Credit : Getty

గోరువెచ్చని నీటితో తలస్నానం

తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లను మాత్రమే వాడాలి. బాగా వేడిగా ఉండే నీళ్లు తల చర్మాన్ని పొడిగా మార్చి సహజమైన నూనెలను తొలగిస్తాయి. దీనివల్ల జుట్టు బలహీనమై రాలడం మొదలవుతుంది. అలాగే చల్లటి నీరు కూడా కొంతమందికి తలలో తేమను సరిగా క్లీన్ చేయకపోవచ్చు. కాబట్టి గోరువెచ్చని నీరు ఉపయోగించడం ఉత్తమం. ఇది స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల జుట్టు మూలాలు బలపడతాయి.

36
షాంపూను నేరుగా అప్లై చేయకూడదు
Image Credit : stockPhoto

షాంపూను నేరుగా అప్లై చేయకూడదు

చాలామంది షాంపూను డైరెక్ట్‌గా తలపై వేసి రుద్దుతుంటారు. ఇది స్కాల్ప్‌ను ఇర్రిటేట్ చేసి జుట్టు రాలడానికి కారణమవుతుంది. షాంపూను కొద్దిగా నీటిలో కలిపి తర్వాత తలకు అప్లై చేస్తే అది సమానంగా వ్యాపించి మురికి సులభంగా తొలగుతుంది. అలాగే కెమికల్స్ ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ చిన్న మార్పు జుట్టు ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.

46
వారానికి 2-3 సార్లు తలస్నానం
Image Credit : our own

వారానికి 2-3 సార్లు తలస్నానం

రోజూ తలస్నానం చేయడం వల్ల తలలో ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. ఇవి జుట్టును రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నూనె తగ్గిపోతే జుట్టు పొడిగా మారి రాలిపోతుంది. అలాగే చాలా రోజులు తలస్నానం చేయకపోతే ధూళి, చెమట, ఆయిల్ పేరుకుపోయి స్కాల్ప్ సమస్యలు రావచ్చు. అందుకే వారానికి 2–3 సార్లు తలస్నానం చేయడం మంచిది.

56
జుట్టును సున్నితంగా తుడవడం
Image Credit : Getty

జుట్టును సున్నితంగా తుడవడం

చాలామంది జుట్టు త్వరగా డ్రై అవ్వాలనే ఉద్దేశంతో రఫ్‌గా టవల్‌తో రుద్దుతుంటారు. ఇది జుట్టు మూలాలను బలహీనపరిచి రాలిపోవడానికి కారణమవుతుంది. తడి జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మృదువుగా ఒత్తుతూ నీటిని తీసేయాలి. వీలైతే మైక్రోఫైబర్ టవల్ ఉపయోగించడం మంచిది.

66
తల ఆరిన తర్వాత దువ్వుకోవడం.
Image Credit : Getty

తల ఆరిన తర్వాత దువ్వుకోవడం.

తడి జుట్టు ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు సులభంగా తెగిపోతుంది. తల పూర్తిగా ఆరిన తర్వాత వెడల్పు దంతాలున్న దువ్వెనతో మెల్లగా దువ్వుకోవడం మంచిది. ఇది జుట్టును క్రమబద్ధంగా ఉంచడమే కాకుండా స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ అలవాటు రోజూ పాటిస్తే జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Related Stories
Recommended image1
Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image2
Rice Water: బియ్యం నీళ్లతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved