ఈ ఆయిల్ తో జస్ట్ వారం రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..
సెలెరీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు సెలెరీతో ఆయిల్ ను తయారుచేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది.

సెలెరీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పురుషుల్లో లైంగిక సామర్థాన్ని పెంచుతుంది. వీర్యం నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీనిలో విటమిన్ ఎ, మాంగనీస్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వెజిటేబుల్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
సెలెరీని తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అయితే సెలెరీతో ఆయిల్ ను తయారుచేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టుతో పాటుగా ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
సెలెరీ ఆయిల్ ను ఎలా తయారుచేయాలి
సెలెరీ ఆయిల్ ను తయారు చేయాలంటే.. ముందుగా కొంచెం కొబ్బరి నూనెను తీసుకుని దానిని స్టవ్ పై పెట్టండి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో సెలెరీ వేయండి. సెలెరీ మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసి స్టవ్ ను ఆపేయండి. ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత దీనిని కంటైనర్ లో నిల్వ చేయండి. ఈ నూనెను వారానికి రెండు రోజులు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. కుదుళ్లు బలంగా తయారవుతాయి.
సెలెరీ నూనెను జుట్టుకు రాయడం వల్ల మీ జుట్టు తెల్లగా మారే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. తెల్లజుట్టుతో బాధపడేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూనె మీ జుట్టును అందంగా మారుస్తుంది.
జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది
ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం, జుట్టు సంరక్షణ లేకపోవడం, కొన్ని రకాల మందుల వాడకం, అనారోగ్య సమస్యల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. అయితే ఈ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. సెలెరీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడతాయి.
డ్రై హెయిర్, నిర్జీవమైన జుట్టు ఉన్నవారికి కూడా సెలెరీ ఆయిల్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొబ్బరినూనెతో తయారుచేయబడుతుంది. దీనిలో మాయిశ్చరైజర్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే జుట్టు తేమగా ఉండేట్టు చూస్తుంది. ఈ నూనె జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.