- Home
- Life
- వినాయక చవితి 2023: మట్టితోనే కాదు వీటితో కూడా ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను సులువుగా తయారుచేయొచ్చు
వినాయక చవితి 2023: మట్టితోనే కాదు వీటితో కూడా ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను సులువుగా తయారుచేయొచ్చు
వినాయక చవితి 2023: మట్టితోనే కాదు వీటితో కూడా ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను సులువుగా తయారుచేయొచ్చు
- FB
- TW
- Linkdin
Follow Us
)
ganesh chaturthi 2023
Ganesh Chaturthi 2023: వినాయక చవితి పండుగ దగ్గకొచ్చింది. ఇంకేముంది ఇప్పటి నుంచే మంది వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తుంటారు. ఈ పండుగను పది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే కెమికల్స్ తో తయారుచేసిన విగ్రహాలు పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. అందుకే ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను మాత్రమే పెట్టాలని చెబుతుంటారు. మట్టితోనే కాదు ఇంకా రెండు పదార్థాలతో కూడా ఇంట్లోనే చాలా సులువుగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాలను తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Ganesh Chaturthi 2023
మట్టితో..
మట్టితో కూడా ఇంట్లోనే చాలా సులువుగా వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయొచ్చు. ఇందుకోసం బంకమట్టిని తీసుకుని అందులో నీళ్లు పోసి గోధుమ పిండిలా బాగా కలపాలి. ఈ మట్టిని కాసేపు అలాగే ఉంచండి. గంట తర్వాత విగ్రహాన్ని తయారుచేయండి. విగ్రహానికి ఆకారం ఇచ్చిన తర్వాత వినాయకుడి తొండం, చేతులు, కాళ్లు తయారు చేయండి. విగ్రహం తయారైన తర్వాత ఆరనివ్వండి. విగ్రహం ఆరిన తర్వాత వాటర్ కలర్ తో పెయింట్ వేయండి.
కాగితంతో..
కాగితపు గుజ్జుతో కూడా గణపతి విగ్రహాన్ని తయారుచేయొచ్చు. దీని కోసం కాగితాన్ని నీటిలో బాగా నానబెట్టండి. కాసేపటి తర్వాత కాగితాన్ని మెత్తగా రుబ్బి గణపతి విగ్రహాన్ని తయారుచేయండి. అయితే విగ్రహం విరిగిపోకుండా ఉండేందుకు ఫెవికాల్ ను కూడా ఉపయోగించండి. ఇది గణపతి విగ్రహాన్ని దృఢంగా ఉంచుతుంది. గణపతి విగ్రహాన్ని పూర్తిగా తయారుచేసిన తర్వాత రంగులు వేయండి. కాగితం గణపతిపై రాళ్లు, లేసులు మొదలైన వాటిని అతికించి అందంగా తయారుచేయొచ్చు.
Ganesh Chaturthi 2023
చాక్లెట్ తో..
ఆశ్ఛర్యంగా అనిపిస్తోందా? కానీ చాక్లెట్ తో కూడా వినాయక విగ్రహాన్ని తయారుచేయొచ్చు. ఇందుకోసం ముందుగా చాక్లెట్ ను ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత దీనిని బయటకు తీసి గ్యాస్ లేదా మైక్రోవేవ్లో కొన్ని సెకన్ల పాటు ఉంచండి. ఆ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయండి. అయితే మొదట దీర్ఘచతురస్రాకార ఆకారంలో విగ్రహాన్ని తయారుచేయండి.