MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ పండ్లను తింటే మీరెంత అందంగా కనిపిస్తారో..!

ఈ పండ్లను తింటే మీరెంత అందంగా కనిపిస్తారో..!

పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మన చర్మం కాంతివంతంగా ఉండటానికి కూడా సహాయపడతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 06 2023, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image: Getty

Image: Getty

మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో .. మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అలాగే మన చర్మాన్ని బయటి నుంచి శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. లోపలి నుంచి దానికి పోషణ అందించడం కూడా అంతే ముఖ్యం. మన చర్మం  ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం అవసరం.  అయితే చర్మ ఆరోగ్యానికి పండ్లు మంచి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. కొన్ని రకాల పండ్లు మన చర్మాన్ని తాజాగా, తేమగా, కాంతివంతంగా కనిపించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మామిడి పండ్లు

మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. ఈ మామిడి పండ్లు మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్ సి , ఇతర యాంటీఆక్సిడెంట్లు మన చర్మం మెరిసేందుకు సహాయపడతాయి.

38

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు బొప్పాయిలో 91-92% వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఈ పండులో మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జీర్ణక్రియ సులభతరం చేయడానికి, మలబద్దకాన్ని నివారించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి,  చర్మ సంరక్షణకు ఎంతో సహాయపడుతుంది. ఈ పండు మన చర్మం కాంతివంతంగా కనిపించడానికి కూడా సహాయపడుతుంది. 
 

 

48

ఉసిరి

ఉసిరిని రోజూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఉసిరికాయ మీరు యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. 

పుచ్చకాయ

పుచ్చకాయలో 95% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే పుచ్చకాయలను తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

58

జామకాయ

విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే జామకాయను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ పండు చర్మంపై ముడతలను నివారించి.. మెరిసేలా చేస్తుంది.

68

ఆరెంజ్

నారింజ పండును తింటే మీన  ఇమ్యూనిటీ పవర్ ఇట్టే పెరుగుతుంది. ఈ  పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 
 

78

పైనాపిల్

పైనాపిల్ లో 'బ్రోమలైన్ ' అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అలాగే పైనాపిల్ లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. వీటిని తింటే మీ చర్మం యవ్వనంగా ఉంటుంది. 

నిమ్మకాయ

విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మకాయ మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా  చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. 
 

88

బెర్రీలు

బెర్రీలు కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీలు, కోరిందకాయలలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. ముఖ్యంగా బ్లూబెర్రీలల్లో ఉండే విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Psychology: శత్రువు కి దగ్గరైనా ఉండొచ్చు.. కానీ,‘ Crab mentality’ ఉన్నవారికి మాత్రం దూరంగా ఉండాలి.. !
Recommended image2
Hibiscus Shampoo: మందారం షాంపూ తయారుచేసుకుని వాడితే జుట్టు రాలడం ఆగిపోతుంది
Recommended image3
Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved