MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Wedding Ritual: ఇక్కడ పెళ్లికి ముందు ఏకంగా పెళ్లి కూతురినే కిడ్నాప్ చేస్తారు..!

Wedding Ritual: ఇక్కడ పెళ్లికి ముందు ఏకంగా పెళ్లి కూతురినే కిడ్నాప్ చేస్తారు..!

Wedding Ritual: పెళ్లి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అయితే, కొన్ని సంప్రదాయాలు వెంటే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని వింత పెళ్లి సంప్రదాయాలు ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 29 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పెళ్లి సంప్రదాయం..
Image Credit : Gemini

పెళ్లి సంప్రదాయం..

ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లు అంటే కేవలం వేడుకలు మాత్రమే కావు.. ఎన్నో విభిన్నమైన సంప్రదాయాలకు, ఆచారాలకు అవి నిలయం. ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో వివాహ వేడుకలను జరుపుకునే విధానం ఎంతో ఆశ్చర్యకరంగా, విచిత్రంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన, విభిన్నమైన 7 అద్భుతమైన పెళ్లి సంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.ప్లేట్లు పగల కొట్టకొట్టడం..
Image Credit : Gemini ai

1.ప్లేట్లు పగల కొట్టకొట్టడం..

జర్మనీలో పెళ్లికి ముందు రోజు జరిగే వేడుకలో బంధువులు, స్నేహితులు పాత పింగాణీ ప్లేట్లు, గిన్నెలు తెచ్చి కొత్త జంట ఇంట ముందు పగలగొడతారు. "పగిలిన పెంకులు అదృష్టాన్ని తెస్తాయి" అనేది వారి నమ్మకం. ఈ చెత్త అంతా తర్వాత ఆ కొత్త జంటే స్వయంగా ఊడ్చి శుభ్రం చేయాలి.

2. చెప్పుల కోసం బేరసారాలు

ఉత్తర భారతదేశ వివాహ వేడుకల్లో ‘జూతా చుపాయ్’ ఆచారం చాలా సరదాగా సాగుతుంది. పెళ్లి మండపంలోకి అడుగుపెట్టే ముందు వరుడు తన చెప్పులను విప్పుతాడు. వెంటనే వధువు చెల్లెళ్లు, కజిన్స్ ఆ చెప్పులను దొంగిలించి దాచేస్తారు. ఆ తర్వాత వాటిని తిరిగి ఇవ్వడానికి వరుడితో భారీగా బేరసారాలు ఆడుతూ నవ్విస్తారు.

3. ఏడుస్తూ పాటలు పాడతారు..

చైనాలోని తుజియా కమ్యూనిటీలో పెళ్లికి ముందు వధువు ఏడుపుతో కూడిన పాటలు పాడుతుంది. వివాహానికి కొన్ని వారాల ముందే ఈ ఆచారం ప్రారంభమవుతుంది. ఇళ్లొదిలి వెళ్తున్నందుకు బాధను, తల్లిదండ్రుల ప్రేమను వ్యక్తూ చేస్తూ వధువు ఏడుస్తూ పాటలు పాడుతుంటే.. క్రమంగా కుటుంబంలోని ఇతర మహిళలు కూడా తోడవుతారు. అందరూ కలిసి ఏడుస్తారు.

33
4. పెళ్లి కూతురు కిడ్నాప్.
Image Credit : Gemini ai

4. పెళ్లి కూతురు కిడ్నాప్.

రొమేనియా పెళ్లి రిసెప్షన్‌లో స్నేహితులు సరదాగా వధువును కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత వరుడు తన భార్యను విడిపించుకోవడానికి షాంపైన్ ఇవ్వడం, డ్యాన్స్ చేయడం లేదా కొన్ని సరదా టాస్క్‌లు పూర్తి చేయడం చేయాల్సి ఉంటుంది. పెళ్లి వేడుకలో అతిథులకు ఇది మంచి వినోదాన్ని పంచుతుంది.

5. వివాహ బంధానికి ప్రతీకగా ఐరిష్ 'రింగ్-వార్మింగ్'

ఐర్లాండ్‌లో జరిగే పెళ్లిళ్లలో 'రింగ్-వార్మింగ్' అనే అందమైన ఆచారం ఉంది. పెళ్లికి ముందు ఉంగరాలను అతిథులందరి చేతుల మీదుగా పాస్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆ ఉంగరాలను కాసేపు చేతిలో పట్టుకొని ఆ జంట కోసం మనసారా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆ విధంగా అతిథులందరి ఆశీస్సులు పొందిన తర్వాతే ఆ ఉంగరాలను వధూవరులు ధరిస్తారు.

6. కన్నీటి వీడ్కోలు

టర్కీలో జరిగే 'కినా గెసెసి' ఎంతో భావోద్వేగంగా సాగుతుంది. వధువు అరచేతిలో గోరింటాకు పెట్టే సమయంలో అందరూ కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను, పుట్టింటిని వీడుతున్న బాధను గుర్తుచేసే పాటలు పాడుతారు. ఆ సమయంలో వధువుతో పాటు ఆమె తల్లి కూడా కన్నీరు పెట్టుకోవడం ఇక్కడ ఆనవాయితీ.

7. అదృష్టం కోసం గ్రీకు బాదం పప్పులు

గ్రీకు వివాహ వేడుకల్లో అతిథులకు 'కూఫెటా' అనే షుగర్ కోటింగ్ చేసిన బాదం పప్పులను బహుమతిగా ఇస్తారు. ఇవి ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ప్యాక్ చేస్తారు. ఎందుకంటే బేసి సంఖ్యను ఎప్పటికీ సమానంగా విభజించలేము. అలాగే బాదం చేదుగా, షుగర్ తియ్యగా ఉంటుంది.. ఇది జీవితంలో కష్టసుఖాలకు ప్రతీక.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bedroom Deep Cleaning: ఎంత క్లీన్ చేసినా బెడ్ రూంలో దుమ్ము ఉంటుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
Recommended image2
Sarees: పండగలు, ఫంక్షన్లకు ఈ చీరలు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!
Recommended image3
Eggs: రోజుకి ఎన్ని కోడిగుడ్లు తినాలి? మరీ ఎక్కువగా తింటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Rice Water: అన్నం వండిన గంజి పారబోస్తున్నారా? ఆ గంజిని రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Hotel: హోటల్ లో స్టే చేస్తున్నారా? రూమ్ లోకి అడుగుపెట్టగానే ఫస్ట్ చేయాల్సింది ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved