- Home
- Life
- Friendship Day 2022: ఫ్రెండ్ షిప్ డే రోజు మీ ఫ్రెండ్ ను సర్ ప్రైజ్ చేసే గిఫ్ట్ ఐడియాస్.. మీ కోసం..
Friendship Day 2022: ఫ్రెండ్ షిప్ డే రోజు మీ ఫ్రెండ్ ను సర్ ప్రైజ్ చేసే గిఫ్ట్ ఐడియాస్.. మీ కోసం..
Friendship Day 2021: ‘దోస్త్ మేరా దోస్త్ తూహే మేరీ జాన్.. వాస్తవంరా దోస్త్ నువ్వేనా ప్రాణం’ అనే పాటను వినే ఉంటారు. ఈ పాట వింటుంటే.. మన స్నేహితులు గుర్తొస్తారు. లోకంలో ఎన్ని బంధాలున్నా.. స్నేహానికి మించి ఏది ఎక్కువ కాదనిపిస్తుంది. స్నేహం ఒక్కటి చాలు ఎన్ని కష్టాలనైనా ఎదురించడానికి..

friendship day
వెలకట్టలేని.. ఎన్నటికీ వీడిపోనిది.. జీవితాంతం మనకు తోడుగా ఉండే బంధమేదైనా ఉందంటే అది స్నేహ బంధమే. స్నేహాన్ని ఎన్ని కోట్లిచ్చినా కొనలేం. దీనికి ఏ కులం, ఏ మతం అంటూ బేధాలుండవ్. స్నేహితుడు లేని జీవితం సంపూర్ణంగా ఉండదేమో. నా దోస్త్ రా వీడు అన్న మాటలో ఎంత సంతోషం ఉంటుందో మెరిసే కళ్లలోనే చూడొచ్చు. మరి మీ దోస్త్ ను ఈ ఫ్రెండ్ షిప్ డేకు ఎలా సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నారు.
అయితే ప్రతి ఏడాది జూలై 30 న అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఆగస్టు మొదటి ఆదివారం నాడు భారతదేశంతో పాటుగా ఇంకొన్ని దేశాలు ఫ్రెండ్ షిప్ డేను సెలబ్రేట్ చేసుకుంటాయి. మరి ఈ రోజు సందర్బంగా మీ ఫ్రెండ్ కు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే సర్ ప్రైజ్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రేస్ లెట్ ఫ్రెండ్ షిప్ బ్యాండ్
ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. ఖచ్చితంగా ఫ్రెండ్ షిప్ బ్రేస్ లెట్ ను కట్టుకుంటారు. దీన్ని కొన్ని రోజులకు తీసేసినా.. మీ గుర్తుగా దాన్ని అలాగే దాచిపెడతారు. దానికంటే ముందు మీ ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగో మీరు కట్టే ఫ్రెండ్ షిప్ బ్రేస్ లెట్ యే తెలియజేస్తుంది. అందుకే ఈ ఫ్రెండ్ షిప్ డేకు బ్రాస్ లెట్ ను ఫ్రెండ్ షిప్ బ్యాండ్ గా ఇవ్వవచ్చు. ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లు మార్కెట్ లో అనేక రకాల స్టైలిష్ బ్రాస్ లెట్ లే ఉంటాయి.
సన్ గ్లాసెస్
ఫ్రెండ్ షిప్ డే గిఫ్ట్ గా మీ దోస్త్ కు మీరు మంచి సన్ గ్లాసెస్ ను కూడా కొనొచ్చు. ఇవి 500 నుంచి 5000 రూపాయల వరకు లభిస్తాయి. మీ బడ్జెట్ కు తగ్గట్టు మీ స్నేహితుడికి బహుమతి ఇవ్వొచ్చుు.
ఎయిర్ పాడ్స్ :
మీ ఫ్రెండ్ కు కొత్త గాడ్జెట్లను తీసుకోవడం ఇష్టమైతే.. మీరు ఏం ఆలోచించకుండా మీ ఫ్రెండ్ కోసం ఇయర్ బడ్స్ లేదా ఎయిర్ పాడ్ లను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇవి 1500 నుంచి 20,000 వరకు అందుబాటులో ఉం టాయి.
ఫ్రెండ్ షిప్ కప్
ఫ్రెండ్లీ గిఫ్ట్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు ఈ ఫ్రెండ్ షిప్ డేకు ఫ్రెండ్ షిప్ కోట్స్ తో ఒక కాఫీ మగ్ లేదా కస్టమైజ్డ్ కాఫీ మగ్ ను ఇవ్వొచ్చు. రెండు కప్పులు కొని ఒకటి మీకు మరోటి మరోటి మీ ఫ్రెండ్ కు ఇవ్వండి.
స్పోర్ట్స్ షూస్
యువతకు స్పోర్ట్స్ షూస్ అంటే చాలా ఇష్టం. అంతుకే వీటి క్రేజ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. రకరకాల స్నీకర్లు, కాన్వాస్ షూలను ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఫ్రెండ్ షిప్ డే నాడు మీరు మీ స్నేహితుడికి మంచి షూలను బహుమతిగా తీసుకోండి.
టీ-షర్ట్స్
ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ గా ఉండాలంటే మీ స్నేహితుడికి మీకు ఒకేరకమైన టీ షర్టును తీసుకోండి. ఆ రోజు ఇద్దరూ వాటినే ధరించి సెలబ్రేట్ చేసుకోండి. టీ షర్ట్స్ మీ దోస్త్ ను సర్ ప్రైజ్ చేస్తుంది.
స్టడీ ల్యాంప్స్
స్టడీ ల్యాంప్స్ ను కూడా మీ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇవి రాత్రి పూట చదువుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే మీ స్నేహితుడికి గుడ్ నైట్ స్టడీ ల్యాంప్ ని బహుమతిగా ఇవ్వవచ్చు.
ఫోటో కోల్లెజ్ లు
ఫ్రెండ్ షిప్ డే నాడు మీ స్నేహితుడితో మీకున్న పాత జ్ఞాపకాలను పంచుకోవచ్చు. వాళ్లతో దిగిన ఫోటోల కోల్లెజ్ క్రియేట్ చేసి.. ఫోటో ఫ్రేమ్ ని బహుమతిగా ఇవ్వవచ్చు.
టెడ్డీ బేర్
మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కు బహుమతిని ఇవ్వాలనుకుంటే.. టెడ్డీని బహుమతిగా ఇవ్వొచ్చు. ఎందుకంటే అమ్మాయిలకు టెడ్డీలంటే చాలా ఇష్టం.