MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వీటిని తిన్నా జుట్టు రాలడం ఆగుతుంది తెలుసా?

వీటిని తిన్నా జుట్టు రాలడం ఆగుతుంది తెలుసా?

కాలుష్యం నుంచి పోషకాల లోపం వరకు .. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మీరు తినే ఆహారంలో కొన్నింటిని చేర్చడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Jun 03 2023, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
hair loss

hair loss

ప్రస్తుతం చాలా మందిని వేధించే సమస్యల్లో హెయిర్ ఫాల్ ఒకటి. ఈ జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిపుణుల ప్రకారం.. పోషకాల లోపమే జుట్టు రాలడానికి ప్రధాన కారణం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ  జుట్టు రాలడాన్ని నియంత్రించొచ్చు. జుట్టు రాలడం ఆగాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

29
Image: Getty Images

Image: Getty Images

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో జింక్, రాగి, మెగ్నీషియం, సెలీనియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు అదనపు టెస్టోస్టెరాన్ వల్ల కలిగే జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి.
 

39
Image: Getty Images

Image: Getty Images

వాల్ నట్స్

వాల్ నట్స్ టేస్టీగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు బాగా పెరిగేందుకు, కొత్త వెంట్రుకలు మొలిచేందుకు, జుట్టు రాలడాన్ని నివారించేందుకు సహాయపడుతుంది. 
 

49
flax seeds

flax seeds

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు రాలడం ఆగుతుంది.
 

59

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాల్లో గామా-లినోలెనిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన పోషకం. ఇది జుట్టు కుదుళ్లను మృదువుగా, ప్రకాశవంతంగా, తేమగా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. అలాగే కొత్త జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. 
 

69
Soaked Almonds

Soaked Almonds

బాదం పప్పు

బాదం పప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. హెయిర్ ఫాల్ ను కూడా ఆపుతుంది.

79
Image: Getty

Image: Getty

చియా విత్తనాలు

చియా విత్తనాలలో జింక్, రాగి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును పోషించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి కలిసి పనిచేసే రెండు ముఖ్యమైన ఖనిజాలు. ఈ విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా ఉంటాయి. 
 

89

పిస్తా

బయోటిన్ పుష్కలంగా ఉండే పిస్తాపప్పు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే పొడి జుట్టుకు పోషణ ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన ఇనుము కుఅద్భుతమైన మూలం.
 

99
fenugreek

fenugreek

మెంతులు

మెంతుల్లో జుట్టు కుదుళ్లకు మేలు చేసే సమ్మేళనాలు ఉంటాయి. మెంతులు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ జుట్టు రాలడాన్నితగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
చేతికి నిండుగా ట్రెండీ బంగారు గాజులు
Recommended image2
బంగారానికి పోటీ ఇచ్చేలా మెరిసే వెండి ఉంగరాలు
Recommended image3
Pregnancy: గర్భిణులు శివలింగాన్ని తాకకూడదా? పూజించకూడదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved