Hair roots pain: జుట్టు మూలాల్లో నొప్పిగా ఉంటోందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
hair roots pain: చాలా మందికి హెయిర్ రూట్స్ వద్ద విపరీతమైన నొప్పి పడుతుంది. ఇలా కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

hair roots pain: కలుషిత వాతావరణం, మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు వంటి ఎన్నో కారణాల వల్ల చాలా మంది హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి తోడు జుట్టు మూలాల నొప్పి (hair roots pain) సమస్యతో సతమతమవుతున్నారు.
hair roots pain ను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. జుట్టు మూలాలు ఇలా నొప్పి పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. బిగుతుగా ఉండే కేశాలంకరణల వల్ల నెత్తిమీద ఇన్ఫెక్షన్లు లేదా తేమ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
అలాంటి సమయంలో చాలా సార్లు నెత్తిమీద చర్మం రక్తణాళాల్లో పావుకు గురయ్యి చుట్టుపక్కల ఉన్న నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో జుట్టు మూలాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. మరి ఈ నొప్పినుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
జుట్టును వదులుగా వేయండి.. జుట్టును బిగ్గరగా అల్లడం వల్ల జుట్టు మూలాలు బాగా సాగుతాయి. దీంతో సిరల్లలో వాపు వస్తుంది. అంతేకాదు జుట్టు రూట్స్ దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఇది జుట్టును దెబ్బతీస్తుంది. దీనివల్ల జుట్టు బాగా రాలడంతో పాటుగా సన్నగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు జుట్టును ఎంత వదులుగా వేసుకుంటే అంత మంచిది.
హెయిర్ ప్రొడక్ట్ లకు గుడ్ బాయ్ చెప్పండి.. చాలా సార్లు హెయిర్ ప్రొడక్ట్స్ కూడా జుట్టును బాగా డ్యామేజ్ చేస్తాయి. కొన్ని రకాల షాంపూలు జుట్టు మూలాలను పొడిబారేలా చేస్తాయి. అంతేకాదు దీనివల్ల హెయిర్ రూట్స్ విపరీతంగా నొప్పి పుడుతాయి. అందుకే వీటి వాడకాన్ని మానుకోవాలి.
తలను శుభ్రంగా ఉంచుకోండి.. నెత్తిని శుభ్రంగా ఉంచుకోకపోతే బ్యాక్టీరియా, మురికి బాగా మాడుపై పేరుకుపోతాయి. అంతేకాదు దీనికి తోడు చెమట కూడా పేరుకుపోతుంది. ఈ చెమట లోపలికి వెళితే మాత్రం వాపు, దురద, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జుట్టు మూలాల్లో విపరీతమైన నొప్పి పుడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు జుట్టును శుభ్రపరుచుకుంటూ ఉండాలి.