Health Tips: హెల్తీ గా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినాల్సిందే..
Health Tips: మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను చకచకా చేసుకోగలం. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ ను తినాల్సిందే..

Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. హెల్తీ ఫుడ్ ను తీసుకోవాలి. అలాగే మన లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. అప్పుడే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా కొన్నిరకాల వెజిరేటియన్ ఫుడ్స్ తో మెరుగైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇందులో బ్రెకలీ, వెల్లుల్లి వంటి వాటిలో పోషకాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి వివిధ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతాయి. అయితే పోషకాలు మెండుగా ఉండే ఐదు కాశాహారాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పన్నీర్.. పన్నీర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో జింక్, ప్రోటీన్లు, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి.
పప్పు.. పప్పుల్లో విటమిన్ బి, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు సహాయపడతాయి. పప్పును తినడం వల్ల చాలా సేపటి వరకు కడుపు నిండుగానే ఉంటుంది. దీనివల్ల మీరు మితిమీరి తినలేరు. అంతేకాదు ఈ పప్పులు ప్రోటీన్ లోపం ఏర్పడకుండా చేస్తాయి.
పచ్చని ఆకు కూరలు.. ఆకుకూరలైన తోటకూర, బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఎ, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మంచివి.
వెల్లుల్లి.. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో వ్యాధులు సోకకుండా మనల్ని రక్షిస్తాయి. అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ , అధిక రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతాయి. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.
బీన్స్.. బీన్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. వీటిలో ప్రోటన్లు, ఐరన్, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి ఉపయోగపడతాయి.