Washing Machine: వాషింగ్ మెషిన్ లో దుస్తులు ఉతుకుతున్నారా? ఈ పొరపాటు మాత్రం చేయకూడదు..!
Washing Machine: మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా..? రోజూ దుస్తులు ఆ మెషిన్ లోనే ఉతుకుతున్నారా? అయితే.. వాటిని ఉతికేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

washing machine
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. దాదాపు అందరూ వాషింగ్ మెషిన్ లో నే దుస్తులు ఉతుకుతూ ఉంటారు. అయితే... ఈ మెషిన్ లో దుస్తులు ఉతికే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే... దుస్తులు డ్యామేజ్ అవ్వడమే కాదు.. మెషిన్ కూడా పాడౌతుంది.
మరకలు ఉన్న దుస్తులు...
చాలా మంది దుస్తులపై మరకలు పడితే... వాటిని అలానే ఉంచి వాషింగ్ మెషిన్ లో వేస్తూ ఉంటారు. చాలా కామన్ గా అందరూ చేసే తప్పు ఇది. కానీ.. అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా దుస్తులపై మరకు పడితే.. ముందుగా.. ఆ మరక ను చేతితో ఉతకాలి. మరక వదిలిన తర్వాత.. మెషిన్ లో వేయాలి. అప్పుడు.. ఆ మరక శాశ్వతంగా పోతుంది.
చల్లటి నీరు
కొంతమందికి వేడి నీటిలో దుస్తులు ఉతకడం అలవాటు ఉంటుంది. అయితే, చాలా వేడి నీటిలో ఉతకడం వల్ల అవి దెబ్బతింటాయి. చల్లని నీటిలో బట్టలు ఉతకడం ఎల్లప్పుడూ మంచిది. ఇది రంగు మారకుండా నిరోధిస్తుంది.ముడతలను తగ్గిస్తుంది.
డిటర్జెంట్ పౌడర్ వాడటం..
వాషింగ్ మెషిన్ లో దుస్తులు ఉతికే సమయంలో సరైన మొత్తంలో డిటర్జెంట్ పౌడర్ వాడండి. ఎక్కువ పౌడర్ వాడటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడి దుస్తులు దెబ్బతింటాయి.
ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్
దుస్తులు ఉతికిన తర్వాత ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్‌ను కచ్చితంగా ఉపయోగించాలి. సింథటిక్ దుస్తులు, ముఖ్యంగా లోదుస్తులు, టవల్, జిమ్ బట్టలు చెమట వాసనను నిలుపుకుంటాయి. ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్‌ను ఉపయోగించడం వల్ల దుస్తులు కొత్తవిగా మృదువుగా ఉంటాయి. దుర్వాసనను తొలగిస్తాయి.
లేబుల్‌ను తప్పకుండా చదవండి...
ప్రతి వస్త్రం ఒక లేబుల్‌తో వస్తుంది. ఆ లేబుల్‌లోని సూచనల ప్రకారం దుస్తులు ఉతకాలి. దుస్తుల రకాన్ని బట్టి ఉతికితేనే.. అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.