- Home
- Life
- Father’s Day 2022: నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే ప్రత్యేకమైన గిఫ్ట్ ఐడియాలు మీ కోసమే..
Father’s Day 2022: నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే ప్రత్యేకమైన గిఫ్ట్ ఐడియాలు మీ కోసమే..
Father’s Day 2022: ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డే (Father’s Day) ను జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 19 న ఫాదర్స్ డే వచ్చింది. 1910 నుంచి.. జూన్ 19 న యునైటెడ్ స్టేట్స్ లో ఫాదర్స్ డే ను జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఎంతో ముఖ్యమైన వాడు. పిల్లలు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తారు. ప్రతి బిడ్డ విజయం వెనుక తండ్రి పాత్ర ఎంతో ఉంటుంది. అలాంటి నాన్నకు ఆరోజును స్పెషల్ గా మార్చడానికి ప్రయత్నించండి. ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వండి. మీ నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియడం లేదా.. అయితే ఈ ఆర్టికల్ ను చదివేసి.. మీ నాన్నకు ఇష్టమైనదేదో ప్రజెంట్ చేయండి.

మీరు మీ నాన్నకు బ్లూటూత్ స్పీకర్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది అన్ని వయస్సుల వారికి అవసరం కూడా. ముఖ్యంగా మీ నాన్నకు కారు డ్రైవింగ్ చేసే అలవాటుంటే.. ఈ బహుమతిని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మార్కెట్ లో వివిధ ధరల బ్లూటూత్ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి.
ఒక పుస్తకాన్ని కూడా మీ నాన్నకు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఒక పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం అంటారు. అందుకే మీ నాన్నకు ఇష్టమైన రచయిత పుస్తకాన్ని కొని ఆయను బహూకరించండి.
పువ్వులు ఎల్లప్పుడూ ఉత్తమ బహుమతుల జాబితాలోనే ఉంటాయి. అందుకే చాలా మంది పువ్వులను బహుమతిగా ఇస్తుంటారు. మీరు కూడా మీ నాన్నగారిని విష్ చేయడానికి అందమైన పూల బొకేను కొనండి. అలాగే ఆ బొకేకు మీ చేతులతో రాసిన ఒక ఉత్తరాన్ని కూడా పెట్టండి. మీరు ఎక్కడ ఉన్నా.. ఎంత దూరంలో ఉన్నా.. మీ నాన్నకు ఇది చేరితే.. ఆయన సంతోషానికి అవదులు ఉండవు. పువ్వులను వద్దనుకుంటే ఒక మొక్కను కూడా ఇవ్వొచ్చు. అయినా ఈ రోజుల్లో చాలా మంది ఇంటిని అలంకరించడానికి మొక్కలను కూడా ఉపయోగిస్తున్నారు.
మీ నాన్నకు మంచి షర్ట్ ను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. అతనికి ఇష్టమైన రంగు, ఇష్టమైన బ్రాండ్ చొక్కాను గిఫ్ట్ గా ఇచ్చినా మీ నాన్న ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే దుస్తులు ఎప్పుడూ ఉత్తమ బహుమతుల జాబితాలో ఉంటాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా షాపింగ్ కు వెల్లి మీ నాన్న కోసం మంచి షర్ట్ ను సెలక్ట్ చేయండి.
మీరు మీ నాన్నగారికి ఫిట్ నెస్ బ్యాండ్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరికీ ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. మధుమేహం, గుండెజబ్బులు, హైపర్ టెన్షన్ నుంచి మూత్రపిండాల సమస్యలు ప్రతి ఒక్కరి శరీరంలో తలెత్తుతుంటాయి. మీ నాన్నగారి వయసు 50 సంవత్సరాలు దాటినట్లయితే అతడికి ఫిట్ నెస్ బ్యాండ్ ను ఖచ్చితంగా ఇవ్వండి. ఈ ఫిట్ నెస్ బ్యాండ్ అతనికి శారీరక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి పదేపదే గుర్తు చేస్తుంది.
వాచ్ (Wrist watch)
వాదర్స్ డే సందర్భంగా మీ నాన్నగారికి మీరు వాలెట్ లేదా వాచీని కూడా ఇవ్వొచ్చు. తండ్రులందరికీ ఈ రెండు వస్తువులు చాలా అవసరం. వీరు ఎక్కడికి వెళ్లినా వాలెట్ ను తీసుకెళతారు. అలాగే వాచ్ ను కూడా దరిస్తారు. అందుకే మంచి బ్రాండ్ వాచ్ లేదా వాలెట్ ను ఈ ఫాదర్స్ డేకు గిఫ్ట్ గా ఇవ్వండి.
మీ నాన్నకి అవసరమైన కొన్నిరకాల వస్తువులను కూడా బహుమతులుగా ఇవ్వొచ్చు. ముందుగా మీ నాన్నకు ఏం కావాలో అడగండి. వాటినే మహుమతులుగా ఇవ్వండి. షేవింగ్ కిట్ లేదా మరేదైనా అవసరం ఉంటుంది. అలాంటివేవో కనుక్కొని గిఫ్ట్ గా ఇవ్వండి.