ఒక్కసారి ఫెయిల్ అయితే... ఇక అంతేనా?
తొలి కలయికలో ఉద్రేకం, కోరికలు ఎక్కువగా ఉండి, ఆ ఆందోళనలో సమర్థంగా లైంగిక క్రీడలో పాల్గొనలేకపోవడం అత్యంత సహజమని నిపుణులు చెబుతున్నారు.
శృంగారం పట్ల యువతలో చాలా అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలను ఇంట్లో పేరెంట్స్ తో చర్చించలేరు. కొందరు తమ తోటి స్నేహతులను అడిగి... ఎంతో కొంత తెలుసుకుంటారు.
కొందరైతే కనీసం స్నేహితులతో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. దీంతో... తమకు తెలిసిందే నిజమనే భ్రమలో ఉంటారు. లేదంటో పోర్న్ వీడియోలు, పుస్తకాలు, నెట్టింట సెర్చ్ చేసి తెలుసుకుంటారు.
అయితే.. ఇలా ఎన్ని తెలుసుకున్నా... తొలి కలయిక కూడా అనుభవం లేని వారికి చాలా అనుమానాలు ఉంటాయి. అందులో మొదటిది తొలిసారి కలయికలో సక్సెస్ కాలేదంటే... వారిలో ఏదో లోపం ఉంది అనేది వారి గట్టి నమ్మకం.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తమలో లోపం ఉందని కుంగిపోయే యువకులు చాలా మంది ఉన్నారట. ఈ కారణంతో కొందరైతే పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదని తేలింది. ఇంకొందరైతే సూసైడ్ కూడా చేసుకోవాలని చూస్తున్నారట.
ఈ కారణంతో కొందరైతే పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదని తేలింది. ఇంకొందరైతే సూసైడ్ కూడా చేసుకోవాలని చూస్తున్నారట. అయితే... ఇలాంటి విషయాల్లో ఎలాంటి కంగారు పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. తొలి కలయికలో ఉద్రేకం, కోరికలు ఎక్కువగా ఉండి, ఆ ఆందోళనలో సమర్థంగా లైంగిక క్రీడలో పాల్గొనలేకపోవడం అత్యంత సహజమని నిపుణులు చెబుతున్నారు.
అలా జరిగిందని, కుంగిపోయి, ఆత్మహత్య గురించి ఆలోచించడం అవివేకం. పాత రోజులతో పోలిస్తే, సాంకేతికత ఎంతో పెరిగింది. లైంగిక విషయాల గురించిన ఎంతో సమాచారం ఇంటర్నెట్‌లో దొరుకుతోంది. వీడియోలూ అందుబాటులో ఉన్నాయి.
అలాగే లైంగిక సమస్యలకు సమర్థమైన వైద్య చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. ఇన్ని వెసులుబాట్లు, సౌలభ్యాలు ఉన్నప్పుడు, తొలిసారి కలయికలో ఫెయిల్ అయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని చెబుతున్నారు.
సరైన అవగాహన లేకపోవడం వల్లే తొలి కలయికలో ఫెయిల్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి ఎక్కువ డౌట్స్ ఉంటే వైద్యులను సంప్రదిస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు.
ఒకవేళ నిజంగానే ఏదైనా లోపం ఉంటే... ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని చెబుతున్నారు. కాబట్టి తొలి కలయిక ఫెయిల్ అయితే కంగారుపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.