MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Women Health: 50 ఏళ్లు దాటిన మహిళలు తప్పకుండా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఇవే..

Women Health: 50 ఏళ్లు దాటిన మహిళలు తప్పకుండా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఇవే..

Women Health: మహిళలు సాధారణంగా ఆరోగ్యం విషయంలో స్ట్రాంగ్ గా ఉంటారు. కాని 50 ఏళ్లు దాటిన తర్వాత కాస్త వీక్ అవుతారు. అందువల్ల 50 ఏళ్లు వయసు దాటిన స్త్రీలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jul 06 2025, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మెమ్మోగ్రామ్ టెస్ట్ చేయించుకోండి
Image Credit : stockPhoto

మెమ్మోగ్రామ్ టెస్ట్ చేయించుకోండి

స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో చాలా సాధారణమైనది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడే ముఖ్యమైన పరీక్ష మెమ్మోగ్రామ్. 50 ఏళ్లు దాటిన స్త్రీలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉంటే వైద్యుల సలహా మేరకు ఈ పరీక్షను తరచుగా చేయించుకోవడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష
Image Credit : stockPhoto

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించడానికి పాప్ స్మియర్, HPV పరీక్షలు సహాయపడతాయి. 65 ఏళ్లు వచ్చే వరకు పాప్ స్మియర్ పరీక్ష చేయించుకుంటూ ఉండటం మంచిది. ఈ క్యాన్సర్ ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తరచూ ఈ పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. వరుసగా ఈ టెస్ట్ నెగెటివ్ వస్తే వైద్యులే ఈ టెస్ట్ ఆపేస్తారు. అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. HPV పరీక్షను పాప్ స్మియర్‌తో కూడా కలిపి చేయవచ్చు.

37
ఎముకల సాంద్రత పరీక్ష
Image Credit : stockPhoto

ఎముకల సాంద్రత పరీక్ష

మెనోపాజ్ తర్వాత స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్లు తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎముకల సాంద్రతను కొలవడానికి DEXA స్కాన్ ఉపయోగపడుతుంది. ఎముక బలహీనతను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించవచ్చు. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన స్త్రీలకు ఈ పరీక్ష చేస్తారు. కానీ లక్షణాలు ముందుగానే కనిపిస్తే 50 ఏళ్ల వయసులోనే చేయించుకోవడం మంచిది.

47
పెద్దప్రేగు క్యాన్సర్ పరీక్ష
Image Credit : stockPhoto

పెద్దప్రేగు క్యాన్సర్ పరీక్ష

50 ఏళ్లు పైబడిన స్త్రీలకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొలనోస్కోపీ లేదా సిగ్మోయిడోస్కోపీ వంటి పరీక్షల ద్వారా పేగులోని కణితులు, ఇతర అసాధారణ పెరుగుదలలను గుర్తించవచ్చు. సాధారణంగా పది సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది. 

57
కంటి పరీక్ష
Image Credit : stockPhoto

కంటి పరీక్ష

వృద్ధ మహిళలకు కంటిశుక్లం(Cataract), కంటిచూపు నష్టం(Glaucoma), వయస్సు సంబంధిత మాక్యులార్ క్షీణత(AMD) వంటి కంటి వ్యాధులు రావచ్చు. సంవత్సరానికి ఒకసారి పూర్తి కంటి పరీక్ష చేయించుకోవడం అవసరం.

67
చర్మ క్యాన్సర్, ఇతర పరీక్షలు
Image Credit : stockPhoto

చర్మ క్యాన్సర్, ఇతర పరీక్షలు

శరీరంపై అసాధారణమైన మచ్చలు, పుట్టుమచ్చలు చర్మ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవడం అవసరం. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దంత పరీక్ష, షుగర్, బిపి, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి సాధారణ పరీక్షలు చేయించుకోవాలి.

77
వైద్య సలహా అవసరం
Image Credit : stockPhoto

వైద్య సలహా అవసరం

పైన పేర్కొన్న సమాచారం అంతా ఇంటర్నెట్‌లో లభించిన సాధారణ సమాచారం మాత్రమే. మీ వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ చరిత్ర, రిస్క్ ల ఆధారంగా ఏ పరీక్షలు అవసరం, ఎప్పుడు చేయించుకోవాలి అనేది మీ వైద్యుడిని సంప్రదించి నిర్ణయించుకోవాలి. అదనపు సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం అవసరం.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
మహిళలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Women Health: ఉద్యోగం చేసే మహిళలు కచ్చితంగా తినాల్సినవి ఇవే..!
Recommended image2
Women Health: వయసు పెరుగుతుంటే మహిళలు బరువు ఎందుకు పెరుగుతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved