గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకో గుడ్డు తినమని వైద్యులు కూడా చెబుతున్నారు. కానీ కొంతమంది గుడ్డు తినేందుకు ఎంతో భయపడతారు. దాని వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని భయపడతారు. అది నిజమో కాదో వైద్యులు ఇలా వివరిస్తున్నారు.

గుడ్డుతో ఆరోగ్యం
ఆరోగ్యపరంగా ఇప్పుడు అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వచ్చినప్పట్నించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను తినేందుకు ఇష్టత చూపిస్తున్నారు. ఉదయం అల్పాహారంలో గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోయింది. కానీ కొందరిలో గుడ్డుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అది తమ గుండెకు మంచిదా కాదా అని కూడా ఆలోచిస్తున్నారు. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుందని, అది గుండెకు ఎంతో చెడుచేస్తుందనే భావన ఉంది. కానీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.
శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ బయోకెమిస్ట్ జెస్సీ ఇంచోస్పె. ఈయన ఉత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరు. ఆమె మాట్లాడుతూ గుడ్లు ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతమైనవని చెబుతున్నారు. ఆమె ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు గుడ్లు తింటారట. గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ గుండెకు ఎలాంటి హానీ చేయదని ఆమె చెబుతున్నారు. కోడి గుడ్లలో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి12, సెలీనియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 78 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
గుడ్డులో ఉండే పోషకాలు ఇవే
విటమిన్ ఎ: 8%
ఫోలేట్: 6%
పాంటోథెనిక్ ఆమ్లం (విటమిన్ బి5): 14%
విటమిన్ బి12: 23%
రిబోఫ్లావిన్ (విటమిన్ బి2): 20%
ఫాస్ఫరస్: 7%
సెలీనియం: 28%
గుడ్డుతో గుండె జబ్బులు?
ఎంతో మంది గుడ్లు అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఎంతో మంది భావన. జెస్సీ ఇంచోస్పె చెబుతున్న ప్రకారం గుడ్లు గుండె జబ్బులకు కారణం కాదు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇతర ఆహారాల వల్ల చెడు కొలెస్ట్రాల్ అధికంగా రక్తంలో పేరుకుపోవడం, రక్తంలోని కణాల వాపు, ఆక్సీకరణ ఒత్తిడి వంటివి గుండె జబ్బులకు కారణం అవుతాయి.
పంచదార తగ్గించడం వల్ల
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఉత్తమ మార్గం చక్కెర తీసుకోమని జెస్సీ చెబుతున్నారు. ఎక్కువ చక్కెర కంటెంట్ తీసుకున్నప్పుడు… అది మన శరీరంలో ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను విపరీతంగా పెంచుతుంది. ఇది కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ కణాలను అధికంగా ఉత్పత్తి చేయడానికి, రక్తంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెరగడానికి దారితీస్తుంది.
ఇవి గుండెకు హానికరం
ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర నిండిన ఆహారం కొలెస్ట్రాల్ కంటే గుండెకు చాలా హానికరం. కోడిగుడ్లలో కళ్ళు, మెదడుకు మేలు చేసే లుటీన్, కోలిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గుండెకు హానికరంగా మారుతాయి.
భయపడకుండా గుడ్డు తినకండి
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ గుడ్డు తినడానికి ఏమాత్రం భయపడకండి . సమతుల్య ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు. అదనపు చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు మాత్రం దూరంగా ఉండండి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం కోడిగుడ్డు తినే ముందు వైద్యుడిని సంప్రదించండి. అల్పాహారంలో కోడిగుడ్లు తీసుకుంటే రోజంగా చురుగ్గా ఉంటారు.