Potato Chips: వామ్మో.. చిప్స్ తింటే ఇన్ని రోగాలొస్తాయా..?
Potato Chips:చిప్స్ ను ఎక్కువగా తింటే సంతానలేమి సమస్యలతో పాటుగా గుండె సంబంధిత రోగాలు, హైబీపీ, క్యాన్సర్, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంగాళాదుంపలతో తయారుచేసిన చిప్స్ పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్ఠంగా తింటుంటారు. కానీ టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఈ చిప్స్ ను ప్రతిరోజూ తింటే ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటంటే..
బీపీ పెరుగుతుంది.. చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీటిలో ఉప్పును ఎక్కువ మొత్తంలో వేస్తారు. ఉప్పు వల్ల చిప్స్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ చిప్స్ ను తింటే బీపీ పెరుగుతుందని అమెరికాకు చెంది మాయో క్లినిక్ వెళ్లడిస్తోంది. అంతేకాదు దీనివల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం రెట్టిపు అవుతుందట. అలాగే బ్రెయిన్ పై చెడు ప్రభావం పడుతుందని అధ్యయనం చెబుతోంది. ఈ చిప్స్ కూడా ప్రాసెస్ చేసిన అహారం జాబితాలోకే వస్తుంది. వీటిని తినడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
క్యాన్సర్.. చిప్స్ ను మోతాదుకు మించి తినేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అక్రిలమైడ్ అనే కార్సినెజెనిక్ గుణాలు ఉంటాయి. ఇదే క్యాన్సర్ కు దారితీస్తుందని అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ చెబుతోంది.
గుండెపై ప్రభావం.. చిప్స్ లల్లో సోడియం, శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కారకాలు కూడా. వీటితోనే గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. చిప్స్ లో ఉండే అక్రిలమైడ్ల మూలంగానే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని నేషనల్ లైబ్రరీ ఆప్ మెడిసిన్ తెలుపుతోంది.
infertility
సంతాన సమస్యలు.. చిప్స్ ను ఎక్కువగా తినే వారిలో సంతాన లేమి సమస్యలు వస్తాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. వీటిలో ఉండే కొన్ని కొవ్వులు Reproductive system పై చెడు ప్రభావం చూపెడుతున్నాయని చెబుతున్నారు. దీనివల్ల పిల్లలు కలగడం కష్టమవుతుందట.
మానసిక సమస్యలు.. చిప్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మాన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల డిప్రెషన్ సమస్య బారిన పడే అవకాశం ఉంది. అలాగే యాంగ్జైటీ, ఊరికూరికే కోపం రావడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.