ఏ పని చేయకపోయినా అలసిపోయిన భావన కలుగుతోందా ? అయితే ఈ ఫుడ్స్ ను తీసుకోండి..
కొంతమంది ఏ పనిచేయకపోయినా ఎంతో అలసటగా ఫీలవుతుంటారు. అయితే ఈ అలసటను పోగొట్టేందుకు కొన్ని రకాల ఆహారాలు సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

బజీ షెడ్యూల్డ్, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది వేళకు భోజనం చేయరు. తిన్నా.. పోషకాహారం తీసుకోరు. దీనివల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. శరీరానికి సరిపడా శక్తి లేకపోతే శరీరం అలసటకు గురవుతుంది. అయితే కొంతమంది ఏ పనిచేయకపోయినా అలసటకు గురవుతుంటారు. దీనికి కూడా పోషకాల లోపమే కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరాన్ని శక్తివంతంగా తయారుచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టైం కు నిద్రపోండి
నిద్రలేమి కారణంగా కూడా బాడీ వీక్ గా తయారవుతుంది. అలసిపోయినట్టుగా కూడా కనిపిస్తారు. నిద్రలేమి మానసికంగా మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు జ్ఞాపకశక్తిని కూడా తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజూ తప్పనిసరిగా ఏడు నుంచి ఎనిమిదిగంటలు నిద్రపోండని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకుంటే అలసట మటుమాయం అవుతుంది. ఇందుకోసం మీరు గుమ్మడి గింజలను, అరటి పండ్లను ఎక్కువగా తినాలి. ఎందుంటే వీటిలో మెగ్నీషియం, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి నరాలు, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో శక్తిని ఉత్తత్తి చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
విటమిన్ బి
విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందుకోసం ఆకుకూరలను, తృణధాన్యాలను ఎక్కువగా తీసుుకోవాలి. లేకపోతే శరీరంలో శక్తి లోపిస్తుంది.
vitamin d
విటమిన్ డి
విటమిన్ డి మన శరీరానికి అవసరమయ్యే అత్యవసర పోషకాల్లో ఒకటి. ఇది ఉదయం సూర్మ రశ్మి ద్వారా, గుడ్డు, పొట్ట గొడుగుల ద్వారా మనకు లభిస్తుంది. గుడ్డు లోని పచ్చసొనలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. ఈ విటమిన్ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది.
ఇనుము
వేరు శెనగలు, చనా వంటి ఆహారాల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఇనుము లోపిస్తేనే అలసట వస్తుంది. ఇనుము ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ ను శరీరం మొత్తం సరఫరా చేయడానికి సహాయపడతాయి.
వ్యాయామం
వ్యాయామంతోనే శరీరం శక్తివంతంగా తయారవుతుంది. అలసట మటుమాయం అవుతుంది. అంతేకాదు వ్యాయామం శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. వ్యాయామం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఇందుకోసం మీరు శరీరాన్ని ఎనర్జిట్ గా తయారుచేసే వ్యాయామాలను ఎంచుకోవాలి.