- Home
- Life
- Mirapa Oil: మిరప నూనె గురించి తెలుసా? ఇప్పుడు ఇదే ఆరోగ్యంలో కొత్త ట్రెండ్.. తింటే ఎన్నో లాభాలు
Mirapa Oil: మిరప నూనె గురించి తెలుసా? ఇప్పుడు ఇదే ఆరోగ్యంలో కొత్త ట్రెండ్.. తింటే ఎన్నో లాభాలు
Mirapa Oil: మిరప నూనె ఇప్పుడు అద్భుతమైన మసాలా పదార్థంగా మారిపోయింది. మిరప నూనె ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

మిరప నూనెతో టేస్టీ వంటకాలు
విదేశాల్లో నూడిల్స్, మోమోస్ వంటి డంప్లింగ్స్ వంటి చిరు తిండి తినేటప్పుడు పైన మిరప నూనెను చిలకరిస్తారు. ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్ లో తినే వారికి కూడా ఈ మిరప నూనె పరిచయమే. మోమోలపై, రామన్ నూడుల్స్ వంటి వాటిపై ఈ మిరప నూనెను చిలకరించి తింటే కొత్త రుచి అందుతుంది. నిగనిగలాడే ఎరుపు రంగులో ఉండే ఈ మిరప నూనెకు మంచి రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. న్యూట్రియన్స్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ మిరపకాయల్లోని బయో యాక్టివ్ సమ్మేళనం మన పొట్టలోని మైక్రోబయోటాను కాపాడుతుందని, జీవక్రియను సవ్యంగా జరిగేలా చేస్తుందని, జీర్ణ ఆరోగ్య మద్దతిస్తుందని బయటపడింది. మిరప నూనెను మితంగా తీసుకుంటే శరీరానికి వేడి చేయదని పైగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని అధ్యయనం వివరించింది.
మిరప నూనె అంటే ఏమిటి?
ఎర్రటి మిరపకాయలతో చేసే నూనె.. మిరప నూనె. ఇందుకోసం నూనెను ముందుగానే వేడి చేస్తారు. ఆ వేడి నూనెలో ఎండిన ఎర్ర మిర్చిని వేసి నానబెడతారు. అలాగే వెల్లుల్లి తరుగు, నువ్వులు, మిరియాల పొడి కూడా వేసి నానబెడతారు. అంతే మిరప నూనె సిద్ధమైనట్టే. దీని నుంచి మంచి సువాసన వస్తుంది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్ సూప్ వంటి వాటిపై దీన్ని చిలకరించుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆసియా వంటకాల్లో ఇప్పుడు మిరప నూనె పాత్ర పెరిగిపోయింది.
మిరప నూనెతో బరువు తగ్గొచ్చు
మిరప నూనెలు మన ఆరోగ్యానికి అవసరమైన క్యాప్సైసిన్ ఉంటుంది. ఎర్ర మిరపకాయల్లో కనిపించే ఏదో ఒక బయో యాక్టివ్ పదార్థం ఈ క్యాప్సైసిన్. దీన్ని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీనికి ధర్మోజెనిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. శరీరంలోని క్యాలరీలను బర్న్ చేస్తుంది. అలాగే గుండెకు కూడా ఎంతో మద్దతునిస్తుంది.మిరప నూనెను మీరు తయారు చేసేటప్పుడు నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనె వంటివి వాడితే ఎంతో మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటుంది. గుండె పనితీరుకు మద్దతునిస్తుంది.
తయారీ ముఖ్యం
మిరప నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాన్ని సరైన పద్ధతిలో తయారు చేయకపోతే హానికరంగా మారవచ్చు. తక్కువ నాణ్యత గల నూనెలను వాడడం లేదా ప్రాసెస్ చేసిన నూనెలను వాడడం వల్ల మిరప నూనె మీకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆలివ్ నూనె, నువ్వుల నూనె, వేరుశెనగ నూనె వంటి ప్రాసెస్ చేయని నూనెల్ని ఎంపిక చేసుకొని మిరప నూనెను తయారు చేసుకోవాలి. లేకుంటే ఇతర అనారోగ్యాలు వీటి వల్ల వచ్చే అవకాశం ఉంది.
మిరప నూనెతో సైడ్ ఎఫెక్టులు
మిరప నూనెను అధికంగా తింటే సైడ్ ఎఫెక్టులు అధికంగా వచ్చే అవకాశం ఎక్కువ. ఇది పొట్టలోని లైనింగ్ పొరకు చికాకు పెడుతుంది. దీనివల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆహారం తినాలనిపించదు. యాసిడ్ రిఫ్లెక్స్ కూడా ఎక్కువైపోతుంది. గ్యాస్టిక్ సమస్యలు పెరిగిపోతాయి. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, సున్నితమైన పొట్ట కలిగిన వారు మిరప నూనెకు దూరంగా ఉండటమే మంచిది. అలాగే మిరప నూనెలో అధిక స్థాయిలో ఉప్పును వేయకూడదు. అధికంగా వేడి చేయకూడదు కూడా. అలా చేస్తే హానికరమైన సమ్మేళనాలు బయటపడతాయి. ఇక దీన్ని నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడకుండా ఉండే గాజు కంటైనర్ లోనే చేయాలి. దీనివల్ల అది ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.