back pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? వీటిని తింటే నొప్పి తగ్గుతుంది..
back pain: వెన్ను నొప్పిని అంత సులభంగా వదిలించుకోవడం చాలా కష్టం. కానీ కొన్ని రకాల ఆహారాలకు తీసుకుంటే మాత్రం దాన్నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.. అవేంటంటే..

back pain
ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, రోజంతా డెస్క్ పైనే కూర్చోవడం, శరీరాన్ని తక్కువగా కదిలించడం వంటి కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుంటుంది. ప్రస్తుత కాలంలో ఈ నొప్పి సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఈ నొప్పి వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ నొప్పి వల్ల కూర్చోవడానికి, వంగడానికి, పడుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కారణాలేవైనా కానీ ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందకపోతే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వెన్ను నొప్పి సమస్యతో బాధపడేవారికి కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను డైలీ తినాలి. అవేంటంటే..
బ్రోకలి: ఇది మంచి పోషకాహారం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్ పెయిన్ రాకుండా చేస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. వీటిని కూర చేసుకుని లేదా సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
అవిసె గింజలు: అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ ను కలిగిస్తాయి. ఇందుకోసం అవిసె గింజలను రాత్రంతా వాటర్ లో నాబెట్టాలి. మార్నింగ్ వాటర్ ను వంపేసి పరిగడుపున తినాలి.
డ్రై ఫ్రూట్స్: పోషకాహార లోపంతో కూడా వెన్ను నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాహార లోపాన్ని పోగొట్టడానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం వీటిని రాత్రి మొత్తం నానబెట్టి ఉదయం పరిగడుపున తినాలి.
చేపలు: మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో అవసరం. ఇవి లేకపోతే .. మనం తరచుగా అలసటకు గురవడం, వెన్ను నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయడుతున్నారు. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే చేపలను తరచుగా తినండి. చేపలను తినడం వల్ల ఎలాంటి నష్టం కలగదు కూడా. వెన్ను నొప్పి మరింత తీవ్రమైతే వైద్యుడి సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకూడదు.