Health Tips: ఈ పండును తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావట..
Health Tips: వారానికి రెండు లేదా మూడు సార్లు అవకాడోను తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపునులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు చిన్న వయసు వారికి సైతం వస్తున్నాయి. అసలు ఈ జబ్బులు వచ్చేదాకా ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపించడం లేదు. అందుకోసమే వయసు పైబడిన వారే కాదు యువత కూడా దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలి.
avocado
Journal of the American Heart Association ప్రకారం.. వారానికి రెండు మూడు సార్లు అవకాడో ను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుందట.
అవకాడో పండ్లు గుండె జబ్బులను ఎదుర్కోవడంలో ముందుంటాయని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు (Monounsaturated fat) , డైటరీ ఫైబర్, Unsaturated fats పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే గుండె సమస్యలను కూడా తగ్గిస్తాయని తాజా పరిశోధనలో తేలింది.
మొక్కల ఆధారిత ఆహారం అవకాడోలు. ఇవి గుండెకు సంబంధించిన ఎన్నో జబ్బులు రాకుండా అడ్డుపడతాయి. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. దీనిలో మొత్తం 68,780 మంది ఆడవారు, 41,700 మంది మగవారు పాల్గొన్నారు. వీరు 30 నుంచి 75 వయసులోపు వారే. ఈ అధ్యయనం సుమారుగా ముప్పై ఏండ్ల నుంచి కొనసాగుతోంది.
అంటే ఈ అధ్యయనంలో పాల్గొన్నవారికి మొదట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు అంటే క్యాన్సర్, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్ లు లేకుండే. రానురాను ఈ మొత్తం మందిలో కరోనరీ హర్డ్ డిసీజ్ బారిన 9,185 మంది పడగా, స్ట్రోక్ బారిన 5,290 మంది పడ్డారట.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరి ఆహారపు అలవాట్లు రోజు రోజు నమోదవుతాయి. వీళ్ల ఆహారపు అలవాట్లను పరిశోధకులు ప్రతి నాలుగు ఏండ్లకు ఓసారి అంచనా వేస్తారు.
ఎవరైతే అవకాడోను తరచుగా తీసుకున్నారో వారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. వారానికి రెండు మూడు సార్లు అవకాడోను తీసుకుంటే 16 శాతం గుండె జబ్బులు తగ్గాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అలాగే 21 శాతం కరోనరీ హార్ట్ డిసీజ్ కూడా తగ్గిందట. వాస్తవానికి అవకాడోను చాలా తక్కువ మంది తింటారు. అలాంటి వారే హార్ట్ ప్రాబ్లమ్స్ ను తప్పించుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు.
ముఖ్యంగా మనదేశంలో అవకాడోలను వినియోగించేవారు చాలా తక్కువమందే ఉంటారు. ఎందుకంటే ఇవి మనదేశంలో పండవు. అందులోనూ ఇవి సూపర్ మార్కెట్లల్లో లభించినా వీటి రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది సామాన్యులకు అందని ద్రాక్షగా చెప్పుకోవచ్చు.