వాటర్ ట్యాంక్ ను ఈ ఒక్కదాంతో ఈజీగా క్లీన్ చేయొచ్చు
వాటర్ ట్యాంక్ ను ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండాలి. లేదంటే ట్యాంక్ లో పురుగులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి వాటర్ ను వాడితే లేనిపోని రోగాలు వస్తాయి. అయితే ఒకేఒక్క దాంతో వాటర్ ట్యాంక్ ను ఈజీగా కడిగేయొచ్చు.
నీటి ట్యాంక్
ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా ఉంది. కానీ ఈ వాటర్ ట్యాంక్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేదంటే వాటర్ లో బ్యాక్టీరియా, పురుగులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి వాటర్ ను వాడితే మన ఆరోగ్యం పాడవుతుంది.
నీటి ట్యాంక్
అయితే చాలా మంది వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే దీన్ని ఎలా కడగాలో తెలియదు. అందుకే వాటర్ ట్యంక్ ను శుభ్రం చేయడానికి తిప్పలు పడుతుంటారు. నిపుణుల ప్రకారం.. వాటర్ ట్యాంక్ ను ప్రతి 3 లేదా 6 వారాలకోసారి ఖచ్చితంగా శుభ్రం చేయాలి. మరి ఈ వాటర్ ట్యాంక్ ను ఎలా ఈజీగా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నీటి ట్యాంక్
నీటి ట్యాంకును శుభ్రం చేయడం ఎలా?
ఇంట్లో వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయాలనుకుంటే ముందుగా ట్యాంక్ లో నీటిని పూర్తిగా ఖాళీ చేసేయండి. ఆ తర్వాత ట్యాంక్ లో బ్లీచింగ్ పౌడర్ ను చల్లండి. దీన్ని ఒక రెండుమూడు గంటల పాటు నానబెట్టండి. ఈ బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ లో ఉన్న బ్యాక్టీరియా, పురుగులను పూర్తిగా తొలగిస్తుంది. ఆ తర్వాత నీళ్లతో ట్యాంక్ ను క్లీన్ చేయండి.
నీటి ట్యాంక్
వాటర్ ట్యాంకును శుభ్రంగా ఉంచుకోవడం ఎలా?
వాటర్ ట్యాంక్ క్లీన్ గా ఉండాలంటే మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా వాటర్ ట్యాంక్ మూతను ఓపెన్ చేసి ఉంచకూడదు. లేదంటే ట్యాంక్ లోకి దుమ్ము, ధూళి, కీటకాలు వెళతాయి. అందుకే ఎప్పుడూ మూత పెట్టాలి. అలాగే మీరు వాడే నీళ్లు శుభ్రంగా ఉన్నాయో? లేదో? ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి. అయితే వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి.