Kitchen Tips: ఎండకాలంలోనూ కిచెన్ లో కూల్‌గా వంట చేయాలంటే ఇవి ట్రై చేయండి!
ఫుడ్ తినడం ఈజీ. కానీ వంట చేయడం చాలా కష్టం. మామూలుగానే వంట గదిలో చాలా వేడిగా ఉంటుంది. అందులోనూ వేసవికాలం అయితే ఇక చెప్పనవసరం లేదు. చెమటలు కక్కుతూ వంట చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎండకాలంలో వంట చేసేటప్పుడు కిచెన్ చల్లగా ఉండటానికి కొన్ని చిట్కాలు మీకోసం. చూసేయండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మామూలుగానే వంటగదిలో కాస్త వేడిగా ఉంటుంది. ఇక ఎండకాలంలో అయితే చెప్పనవసం లేదు. ఓ వైపు కిచెన్ వేడి, మరోవైపు ఎండ వేడి వల్ల కిచెన్‌లో నిలబడి వంట చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వంట చేస్తే ఎక్కువగా చెమటలు పట్టడం మొదలవుతుంది.
మహిళలు కాసేపు కూడా అక్కడ నిలబడి వంట చేయలేని పరిస్థితి ఉంటుంది. వేసవి వేడి, కిచెన్‌లో వంట చేసే వేడి రెండు కలిసి చికాకు, చర్మంపై బొబ్బలు, చెమటకాయలు లాంటి చర్మ సమస్యలను కలిగిస్తాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు. వేసవిలో కూడా కిచెన్ కూల్‌గా ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సరైన సమయం
ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు విడివిడిగా వంట చేస్తే, వేసవిలో అలా చేయకుండా మధ్యాహ్నం వండే ఆహారాన్ని కూడా ఉదయమే పూర్తి చేయండి. అలాగే ఏం వండబోతున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీరు వంటగదిలో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉండదు. కూరగాయలను కిచెన్‌లో కాకుండా గాలి వచ్చే ప్రదేశాల్లో కట్ చేయండి. దీనివల్ల మీకు ఎక్కువగా చెమట పట్టదు.
త్వరగా తయారయ్యే ఆహారం
కిచెన్‌లో ఎక్కువసేపు నిలబడి వండే ఆహారాన్ని తయారుచేసే బదులు చాలా త్వరగా తయారయ్యే ఆహారాన్ని వండండి. నిజానికి ప్రోటీన్ రకం ఆహారాలు త్వరగా ఉడుకుతాయి. కాబట్టి ప్రోటీన్ నిండిన ఆహారాలను ఎంచుకుని వండండి.
కిటికీ తెరిచి ఉంచండి!
వంట చేసేటప్పుడు కిచెన్, ఇంటి కిటికీలు తెరిచి ఉంచండి. అప్పుడే వంట చేసేటప్పుడు వేడి ఇంట్లో ఉండదు, బయటకు వెళ్తుంది. అలాగే కిచెన్ నుంచి పొగను బయటకు పంపే ఫ్యాన్ కొని ఉపయోగించండి.
చిన్న పాత్రను ఉపయోగించండి:
సాధారణంగా పెద్ద పాత్రలో వంట చేసేటప్పుడు వేడి పెరుగుతుంది. ఇంకా వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా కిచెన్ మొత్తం వేడిగా ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద పాత్రను ఉపయోగించే బదులు చిన్న పాత్రను ఉపయోగించడం మంచిది.
హైడ్రేటెడ్‌గా ఉండండి:
నిజానికి వేసవిలో శరీరంలో నీరు తగ్గిపోతుంది. అందులోనూ మీరు కిచెన్ వేడిలో వంట చేసేటప్పుడు మరింత వేడిగా ఉంటుంది. కాబట్టి మీరు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు అలసిపోకుండా వంట చేయగలరు. దీనికోసం నీరు తాగడం మాత్రమే కాదు. పండ్ల రసాలను కూడా తీసుకోండి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.