MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Train: రైలు ఎక్కడం కాదు... సరదాగా మీరే రైలు నడపొచ్చు.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా?

Train: రైలు ఎక్కడం కాదు... సరదాగా మీరే రైలు నడపొచ్చు.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా?

Train: ఇప్పటి వరకు చాలా సార్లు మీరు రైలు ఎక్కే ఉంటారు. కానీ, ఎప్పుడైనా రైలు నడిపారా? మీకు కనుక ఒక్కసారి అయినా రైలు నడపాలి అనే కోరిక ఉంటే ఈ ప్లేస్ కి వెళ్లాల్సిందే..

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 10 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
రైలు నడపాలని ఉందా?
Image Credit : Gemini ai

రైలు నడపాలని ఉందా?

ఎప్పుడైనా రైలు డ్రైవర్ సీట్లో కూర్చొని, ఆ గ్రేట్ ఇంజిన్ ని మీరే స్వయంగా నడపాలని కలలు కన్నారా? మనకు రైలు నడపాలి అనే కోరిక ఉన్నా.. అలాంటి అవకాశం ఎందుకు వస్తుంది? అని అనుకుంటున్నారా? నిజంగానే ఇలాంటి ఆఫర్ ని ఓ దేశంలో ఇస్తున్నారు. మీకు కొంచెం డ్రైవింగ్ స్కిల్స్ ఉంటే చాలు. హ్యాపీగా రైలుని డ్రైవ్ చేయచ్చు. ఈ ఆఫర్ ని.. జపాన్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అద్భుతమైన రైల్వే వ్యవస్థ ఉన్న జపాన్.. ఈ అరుదైన అవకాశాన్ని తీసుకువచ్చింది. టోక్యో సమీపంలోని సైతామాలో ఉన్న ప్రసిద్ధ ‘ ది రైల్వే మ్యూజియం’ లో సందర్శకుల కోసం ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది.

View this post on Instagram

A post shared by Kat (@via.kat)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ప్రయాణికుల రైలు కాదు...
Image Credit : Gemini ai

ప్రయాణికుల రైలు కాదు...

రైలు నడపడం అంటే అంత ఈజీ కాదు కదా.. మరి.. అలా ఎలా ఎవరికి పడితే వాళ్లకు ఇస్తారు అనే అనుమానం మీకు రావచ్చు. కానీ, ఇది ప్రయాణికులు ప్రయాణించే రైలు కాదు. ఇది కేవలం ‘మినీచర్ ట్రైన్’. కేవలం... ట్రైన్ నడపాలి అనే అనుభవం కోసం సరదాగా తీసుకువచ్చిన ప్రయత్నం ఇది. ఈ లోకో మోటివ్ ను కేవలం 300 మీటర్ల ట్రాక్ పై మాత్రమే నడపగలరు. ఈ రైలులో ఎక్కువ మంది ఎక్కడానికి కూడా ఉండదు. కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణించగలరు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. నిజమైన రైలులో ఉండేలా డ్రైవర్‌కు స్పీడోమీటర్ , బ్రేక్ ప్రెజర్ గేజ్ సౌకర్యం లభిస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, జపాన్ రైల్వే నిబంధనలను తెలుసుకుంటూ ప్రయాణికుల భద్రతను డ్రైవర్లు ఎలా కాపాడుతారో నేర్చుకోవడానికి చక్కటి అవకాశం.

రైలు నడపాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..

సైతామాలోని రైల్వే మ్యూజియంలో మినీ రైలును నడపాలనుకునేవారు ముందుగానే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవడం మంచిది. దీనికి విపరీతమైన ఆదరణ ఉండటంతో స్లాట్లు త్వరగా నిండిపోతాయి. మ్యూజియం అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మ్యూజియం రాఫిల్ యాప్ ద్వారా బుకింగ్ లేదా రాఫిల్ కోసం ప్రయత్నించవచ్చు. మీరు ఈ ట్రైన్ డ్రైవ్ చేయాలి అంటే... రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం మ్యూజియం చూడాలి అనుకుంటే... రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.

మ్యూజియంలో ముఖ్యమైన విషయాలు...

ఈ మ్యూజియం మొత్తం ఐదు వేర్వేరు స్టేషన్‌లుగా విభజించి ఉంటారు. 'రోలింగ్ స్టాక్ స్టేషన్'లో చరిత్రాత్మక రైళ్లను దగ్గరగా చూడవచ్చు. 'సైన్స్ స్టేషన్' రైళ్లు పనిచేసే విధానాన్ని, 'జాబ్ స్టేషన్' వివిధ రైల్వే ఉద్యోగాలు , భద్రతా కార్యకలాపాలను పరిచయం చేస్తాయి. అలాగే 'హిస్టరీ స్టేషన్' జపాన్ రైల్వే చరిత్రను వివరిస్తే, 'ఫ్యూచర్ స్టేషన్' భవిష్యత్తులో రైల్వే ప్రయాణాల అభివృద్ధిని కళ్లకు కడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tan Removal: ఎండకు ముఖం టాన్ పట్టేస్తుందా? ఈ ఈజీ టిప్ తో మొత్తం క్లీన్
Recommended image2
Gold Bracelet: ఎలాంటి డ్రెస్సుతో అయినా సూపర్ లుక్ ఇచ్చే బ్రేస్లెట్స్!
Recommended image3
Choker Designs: చీరలు, లెహంగాలకు గ్రాండ్ లుక్ ఇచ్చే చోకర్ డిజైన్స్!
Related Stories
Recommended image1
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image2
Rain: మన దేశంలో సంవత్సరమంతా వర్షం పడే ప్రదేశం ఇది...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved