- Home
- Life
- New Study : కాఫీ ప్రియులకు ఎస్ప్రెస్సో షాకింగ్! ఈ పానీయం మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదకరం..
New Study : కాఫీ ప్రియులకు ఎస్ప్రెస్సో షాకింగ్! ఈ పానీయం మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదకరం..
New Study : ఇంట్లో తయారు చేసుకుని తాగిన కాఫీ కంటే.. మెషిన్ మీద తయారయ్యే కాఫీనే చాలా రుచిగా ఉంటుంది. అందుకే చాలా మంది కాఫీని బయటతాగడానికే ఇష్టపడుతుంటారు. నిజానికి ఈ ఎస్ప్రెస్సో కాఫీలు నోటికి రుచిగా అనిపించినా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.

espressos
New Study : ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగనిదే బెడ్ కూడా దిగని వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాలుగైదు సార్లన్నా కాఫీని తాగేస్తుంటారు. కాఫీ వ్యవసనం లాగే మరిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆఫీసుల్లో పనిచేసే వారైతే గంట గంటకు కాఫీ తాగమన్నా తాగేస్తుంటారు. ఎందుకంటే ఈ కాఫీ వారి మైండ్ ను రీఫ్రెష్ చేస్తుంది.
espressos
కాఫీలో చాలా రకాలున్నాయి. వాటిలో ఎస్ప్రెస్సో ఒకటి. ఎస్ప్రెస్సోను కాఫీలల్లో ది బెస్ట్ అనే చెప్పవచ్చు. అంతేకాదు ఇది ఒక రిచ్ స్టైల్ కాఫీ కూడా. ప్రస్తుతకాలంలో ఎస్ప్రెస్సో కాఫీ తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే తాజాగా ఈ ఎస్ప్రెస్సో గురించి ఒక తాజా అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
espressos
మనందరికీ తెలుస.. కాఫీని మితంగా తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిదని. కాఫీలో ఉండే నేచురల్ కెమికల్స్ రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. ఇది స్ట్రోక్ తో సహా గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది. కానీ తాజా అధ్యయనం ప్రకారం.. ఎస్ప్రెస్సో పురుషులు, మహిళల శరీరాలపై ఎలా ప్రభావం చూపుతుందో వెల్లడించింది.
espressos
నార్వేకు చెందిన పరిశోధకులు దీనిపై పరిశోధనలు చేశారు. కాఫీని తీసుకునే విధానం, దానివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లో మార్పును గుర్తించారు. ఈ పరిశోధనలో 40 ఏండ్లు పైబడిన 21,000 మందికి పైనే పాల్గొన్నారు. కాఫీ తాగడం వల్ల మహిళలలు, పురుషులపై వేర్వేరు ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
espressos
కాఫీని ఐదు సార్లకంటే ఎక్కువగా తాగడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. రోజుకు మూడు నుంచి ఐదు ఎస్ప్రెస్సోలను తీసుకునే వారికి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయట. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మహిళలల్లోల కంటే పురుషులకే ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.
espressos
ఆరు కప్పుల కంటే ఎక్కువ ఎస్ప్రెస్సో కాఫీ మహిళలకు ప్రమాదరకం.. అంటే ఎక్కువగా ఎస్ప్రెస్సో కాఫీ తాగడం వల్ల పురుషుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది మహిళల్లో తక్కువగా ఉంటుంది. అలా అని ఆడవారేం సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పలేం. ఎందుకంటే రోజుకు ఆరు సార్ల కంటే ఎక్కువ సార్లు ఎస్ప్రెస్సో ని తీసుకుంటే వీరిలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ప్రమాదముందని పరిశోధనలో వెల్లడైంది.
espressos
ఎస్ప్రెస్సో కాఫీ బెనిఫిట్స్.. వేడినీటిలో కాఫీని మరిగించడం ద్వారా ఎస్ప్రెస్సో కాఫీ తయారవుతుంది. ఇవి బరువు తగ్గడానికి, ఎనర్జీ లెవెల్స్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుందని ఇదివరకు పలు అధ్యయనాలు వెల్లడించాయి. అలా అని కాఫీని మోతాదుకు మించి తాగాలని ఎవరూ చెప్పలేరు. ఏదైనా పరిమితిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాఫీని పరిమితికి మించి తాగితే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎస్ప్రెస్సో లేదా రెగ్యులర్ కాఫీ ఏదైనా సరే లిమిట్ కు మించి తాగకండి.