Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే శుభమా.. అశుభమా..?
Dreams: మన ఆలోచన విధానమే కలలు రావడానికి అసలు కారణమని కొందరు విశ్వసిస్తుంటారు. మరికొందరు నా ఫ్యూచర్ గురించే ఈ కల వచ్చిందని నమ్ముతుంటారు. కలలు మనకు చాలా విషయాలను చెబుతుంటాయని స్వప్ప శాస్త్రం చెబుతోంది. మరి ఈ శాస్త్రం ప్రకారం కలలో జరిగిన విషయాలు మన జీవితంలో నిజం అవుతాయా.. లేదా..

కలలు అదో ఊహకందని ప్రపంచం. ఆ కలలు కొద్ది క్షణాలకు చెరిగిపోయేవే అయినా .. దాని నుంచి పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేని. కలలు జరిగిన విషయాలు ఫ్యూచర్ గురించి హెచ్చరికలు, భవిష్యత్ లో ఫలానా జరగబోతోందని తెలియజేసే సూచికలు అంటూ కొంతమంది విశ్వసిస్తారు. అందుకే ఏ రకమైన కలలు పడ్డా వాటిని వారి కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటారు. వాటిని కొందరు ఏ కాలంలో ఏం మాట్లాడుతున్నావు.. పగటి కలలు ఏమన్నా కంటున్నావా అంటూ కొట్టి పారేస్తుంటారు. మరికొందరు ఆ కలలకు ఏదో బలమైన కారణం ఉందంటూ నమ్ముతుంటారు.
జ్యోతిష్యం, స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో వచ్చిన విషయాలు తప్పకుండా మన నిజ జీవితంలో జరుగుతాయని చెబుతోంది. కలలో కనిపించిన కొన్ని వస్తువులు గానీ, విషయాలు గానీ మనకు ఎన్నో విషయాలను చెప్తాయని పేర్కొంటున్నారు. కాగా కలలో కొన్ని ఘటనలు జరిగినా, కొన్ని రకాల వస్తువులు కనిపించినా వాటిని అరిష్టంగా భావిస్తుంటారు. అయితే కలలో జంతువులు కనిపిస్తే మనకు అంతా మంచే జరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఎలాంటి జంతువులు కనిపిస్తే.. మనకు ఎలాంటి మంచి జరుగుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కలలు మనకు ఎన్నో సంకేతాలను తెలియజేస్తుందని స్వప్న శాస్త్రం పేర్కొంటోంది. వచ్చిన కల ఆధారంగా అది మంచా.. చెడా అని అంచనాకు వస్తారు. అయితే కలలో ఆవు కనిపిస్తే శుభ శకునమే అని స్వప్న శాస్త్రం పేర్కొంటోంది. కలలో ఆవు కనిపించిన వారికి దేవుడి భక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తి ఆ కల గురించి ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోవద్దు. కలలో ఆవు కనిపిస్తే ఆ వ్యక్తి తాను చేపట్టిన పనుల్లో మంచి విజయాన్ని అందుకుంటాడు.
గుడ్లగూబ కలలో కనిపిస్తే ధనధాన్యం మీ చేతికి అందుతుందని సంకేతం. అంతేకాదు.. కలలో గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పై ఎల్లప్పుడూ ఉంటుంది. అందులోనూ ఈ గుడ్లగూబ కొంతమంది దేవతల వాహనంగా ఉంటుందని నమ్ముతారు.
ఏనుగు: చాలా మందికి కలలో ఏనుగు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ కలలో ఏనుగు కనిపిస్తే మీ భవిష్యత్తు సరికొత్త మలుపు తిరగబోతోందని అర్థం. మీకు ధనలాభం కలగడంతో పాటుగా, ఎంతో తొందరగా ధనవంతులుగా మారే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. లేదా మీ ఆర్థిక మస్యలన్నీ తీరిపోతాయి.
పాములు: కలలో పాము కనిపిస్తే చాలు.. హాయిగా పడుకున్న మనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాం. కానీ కలలో పాములు కనిపిస్తే అంతా మంచే జరుగుతుందట. మీరు మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని తెలిపే శుభ శకునమని స్వప్న శాస్త్రం చెబుతోంది. అంతేకాదు కలలో సర్పాలు కనిపిస్తే సురక్షితంగా ఉంటామని కొంతమంది పెద్దలు విశ్వసిస్తారు.
కుందేలు: గాఢ నిద్రలో ఉన్నప్పుడు కుందేలు వంటి జంతువులు చాలా మందికి కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలో కుందేలు కనిపిస్తే.. వారి లవ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. అంతేకాదు మీ ప్రేమను వారికి ఎంతగానో పంచుతారు. అలాగే వివిధ రంగాల్లో ఉన్న వారు మంచి విజయాలను అందుకుంటారు. అందుకే కలలో కుందేలు కనిపిస్తే సంకోచించాల్సిందేమీ లేదు.