MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Plastic Boxes: ప్లాస్టిక్ డబ్బాలు వాసన వస్తున్నాయా? ఇలా చేస్తే కొత్త వాటిలా మారిపోతాయి

Plastic Boxes: ప్లాస్టిక్ డబ్బాలు వాసన వస్తున్నాయా? ఇలా చేస్తే కొత్త వాటిలా మారిపోతాయి

 Plastic Boxes: ప్లాస్టిక్ బాక్సులు, డబ్బాలు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయం తెలిసినా.. ఇప్పటికీ వీటిని రెగ్యులర్ గా వాడే వారు చాలా మంది ఉన్నారు. ఎంత శుభ్రం చేసినా ఈ డబ్బాల నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Plastic Box
Image Credit : Asianet News

Plastic Box

Plastic Boxes: ప్లాస్టిక్ బాక్సులు, డబ్బాలు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇంట్లో పప్పులు నిల్వ చేయడం దగ్గర నుంచి.. లంచ్ బాక్సులు తీసుకువెళ్లే వరకు.. చాలా మంది ప్లాస్టిక్ డబ్బాలనే వాడుతూ ఉంటారు. నిజానికి, వీటిలో ఆహారం నిల్వ చేయడం ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. కానీ, ఆకర్షణీయ రంగుల్లో రావడం, చౌక ధరలో లభించడంతో.. చాలా మందిని వీటినే వాడుతున్నారు. అయితే.. వేసవి కాలం ఎండల కారణంగా.. ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారం త్వరగా పాడైపోతూ ఉంటుంది. అంతేకాదు.. ఆ బాక్సులను ఎంత బాగా శుభ్రం చేసినప్పటికీ, వాటి నుంచి ఏదో ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. అలా రాకుండా.. వాటిని ఎలా శుభ్రపరచాలో... మళ్లీ కొత్త వాటిలా కనిపించేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  ప్లాస్టిక్ లంచ్ బాక్స్ వాసనను పోగొట్టే 5 అద్భుతమైన చిట్కాలు...
Image Credit : Asianet News

ప్లాస్టిక్ లంచ్ బాక్స్ వాసనను పోగొట్టే 5 అద్భుతమైన చిట్కాలు...

1.బేకింగ్ సోడా ( Baking Soda)

బేకింగ్ సోడా ఎలాంటి మొండి వాసనలను అయినా పీల్చుకోవడంలో అద్భుతంగా పని చేస్తుంది. మీరు మీ ప్లాస్టిక్ డబ్బాల్లో కొంచెం బేకింగ్ సోడా వేసి, కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేయాలి. దీనిని బాక్స లోపల అంతా పూసి.. ఒక రాత్రంతా అలానే ఉంచేయాలని. మరుసటి రోజు ఉదయాన్నే నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. వాసన పూర్తిగా తొలగిపోతుంది.

2.నిమ్మరసం లేదా నిమ్మ తొక్క (lemon Juice):

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చంపి, తాజా సువాసనను ఇస్తుంది. దీని కోసం.. మీరు నిమ్మకాయ రసాన్ని ప్లాస్టిక్ బాక్స్ లో పిండినా లేదంటే.. నిమ్మ చెక్కతో బాక్స్ మొత్తాన్ని రుద్దినా సరిపోతుంది. దీని వల్ల వాసన పోవడమే కాదు.. బాక్స్ కి పేరుకుపోయిన మురికి, జిడ్డు లాంటివి కూడా ఈజీగా వదిలేస్తాయి.

33
వీటితో శుభ్రం చేసినా దుర్వాసన పోవాల్సిందే..
Image Credit : Asianet News

వీటితో శుభ్రం చేసినా దుర్వాసన పోవాల్సిందే..

3. వెనిగర్ (Vinegar):

వైట్ వెనిగర్ క్లీనింగ్ ఏజెంట్‌గా చాలా పవర్‌ఫుల్ గా పని చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని బాక్సులో పోయండి. ఒక గంట తర్వాత సబ్బుతో కడిగేయండి. ఇది బ్యాక్టీరియాను అరికడుతుంది. వాసనను కూడా తొలగిస్తుంది.

4. న్యూస్ పేపర్ ట్రిక్ (Newspaper Trick):

ఇది వినడానికి వింతగా ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. రాత్రిపూట లంచ్ బాక్స్ కడిగి ఆరిన తర్వాత, ఒక న్యూస్ పేపర్‌ను ముక్కలుగా చేసి బాక్సులో పెట్టి మూత పెట్టేయండి. న్యూస్ పేపర్ లోని కార్బన్ ప్లాస్టిక్ లో ఉన్న చెడు వాసనను పీల్చుకుంటుంది. ఉదయం పేపర్ తీసేసి ఒక్కసారి నీటితో కడిగితే సరిపోతుంది.

5. కాఫీ పొడి (Coffee powder ):

కాఫీ పొడిలో వాసనలను పీల్చుకునే గుణం ఉంటుంది.కొద్దిగా కాఫీ పొడిని బాక్సులో వేసి మూత పెట్టి ఒక రోజంతా ఉంచండి. ఇది ప్లాస్టిక్ వాసనను పోగొట్టి మంచి ఎరోమాను ఇస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Mixer Jar Cleaning Tips: మిక్సీ జార్ అడుగు మురికి పట్టిందా? సింపుల్ గా క్లీన్ చేసే టెక్నిక్ ఇది..!
Recommended image2
Muskmelon: ప్రకృతి ప్రసాదించిన వరం ఈ పండు, రోజూ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved